పిఎస్ ప్రయోగం విజయవంతం

భూ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించిన ‘ఇస్రో’
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గురువారం మరో ఘనతను సాధించింది. తాజాగా భూ పర్యవేక్షణ ఉపగ్రహం- విస్తృత వర్ణ పటబింబ ఉపగ్రహం(హైసిస్)ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతోపాటు 8 దేశాలకు చెందిన మరి 30 ఉపగ్రహాలను కూడా పిఎస్ రోదసిలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. నెల్లూరులోని సతీశ్ ధావన్ రోదసి కేంద్రం ప్రయోగస్థలం నుంచి ఉదయం 9.57 గంటలకు పిఎస్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నారింజ రంగు మంటలు చిమ్ముతూ మేఘాలవైపుకు దూసుకెళ్లింది. రాకెట్ నింగికి ఎగిరిన 17 నిమిషాల 27 సెకండ్ల తరువాత హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్(హైసిస్)ను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. తర్వాత ఒక గంటకు దాంతోపాటు తీసుకెళ్లిన 30 ఉపగ్రహాలను కూడా నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. ఇస్రో తయారుచేసిన తాజా భూ పర్యవేక్షణ ఉపగ్రహం హైసిస్. దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఈ ఉపగ్రహ డేటా వవసాయం, అటవీ, నేల సర్వేక్షణ, భూగర్భ, తీర మండల అధ్యయనాలకు, దేశీయ జల అధ్యయనాలకు, పర్యావరణ పర్యవేక్షణకు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాన్ని గుర్తించడం వంటి అనేక విషయాల్లో ఉపయోగకరంగా ఉండనుంది. నాలుగు దశలుగా సాగిన ప్రయోగం విజయంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.
సూర్య సమస్థితి ధ్రువ క్షక్యలోకి ఈ భూ పర్యవేక్షణ ఉపగ్రహం ప్రవేశించగానే ఇస్రో చీఫ్ కె. శివన్, శాస్త్రవేత్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గురువారం నిర్వహించిన ఈ ప్రయోగం చాలా ప్రత్యేకమైనది. ప్రధాన ఉపగ్రహంతో పాటు తీసుకెళ్లిన 30 ఇతర ఉపగ్రహాలను కూడా నిర్దిష్ట కక్షలోకి ప్రవేశపెట్టడానికి శాస్త్రజ్ఞులు నాలుగో దశ ఇంజిన్ రెండుసార్లు రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. భూ పర్యవేక్షణ ఉపగ్రహం వేరయ్యాక 30 ఇతర ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఎత్తును సూర్య సమస్థితి ధ్రువ కక్షలో 636 కిమీ. నుంచి 504 కిమీ.కు తగ్గించారు. ఈ ప్రయోగం ఇస్రో అత్యంత దీర్ఘకాల కార్యక్రమం అంటున్నారు. పిఎస్ ఇస్రో 45వ ఫ్లయిట్. ఇది ‘కోర్ ఎలోన్’ వర్షన్. తేలికపాటి ప్రయోగ వాహక వర్షన్ ఇది. ఈ మిషన్ ప్రాథమిక ఉపగ్రహం హైసిస్. దీని జీవిత కాలం ఐదేళ్లు. ఈ ఉపగ్రహం భూ ఉపరితల గోచర, ఎలెక్ట్రోమేగ్నటిక్ స్పెక్ట్రంకు చెందిన ఇన్ సమీప,షార్ట్ ఇన్ ప్రాంతాల అధ్యయనం చేస్తుంది. రోదసినౌక బరువు 380 కిలోలని ఇస్రో తెలిపింది. 8 దేశాలకు చెందిన ఇతర 30 ఉపగ్రహాలను ఇస్రో వాణిజ్య విభాగం యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కంట్రాక్టు పొందడం ద్వారా ప్రయోగించింది. అమెరికాకు చెందిన 23 ఉపగ్రహాలు, ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్లాండ్, మలేషియా, నెదర్లాండ్స్, స్పెయిన్ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహంతో కలిపి 261.5 కిలోల బరువున్న 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఇందులో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలు ఉన్నాయి.
పిఎస్ విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో చీఫ్ శివన్ భారతీయ శాస్త్రజ్ఞులను అభినందించారు. వారి అద్భుత పనితీరు, సమష్టి కృషి మరోసారి విజయాన్ని సాధించాయన్నారు. జిఎస్ ఎంకె3డి2, జిశాట్29 అనే రెండు అద్భుత ప్రయోగాలు చేసిన 15 రోజులకే ఈ ప్రయోగం విజయవంతం చేశారన్నారు. అధునాతన హైపర్ శాటిలైట్ గురించి శివన్ మాట్లాడుతూ ఇది అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వల్ల సాధ్యమైందన్నారు. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్(హైసిస్)కు గుండె వంటి వ్యవస్థ ఓ ఆప్టికల్ ఇమేజింగ్ డిటెక్టర్ చిప్ అన్నారు. దీన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ప్రధాన విభాగమైన అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు రూపొందించారు. ఆ తర్వాత చండీగఢ్ సెమికండక్టర్ ప్రయోగశాల వారు తయారుచేశారు. 630 కిలోమీటర్ల దూరం నుంచి భూమిపై రంగురంగుల చిత్రాలను తీసే అవకాశం ఉంది. ఈ ఉపగ్రహం వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, తీర మండలాల అంచనా, లోతైన నీటి, మట్టి, ఇతర భూగర్భ పరిసరాలకు సంబంధించి అనేక రకాల అనువర్తనాలకు సేవలందిస్తుంది. తమ అంతర్జాతీయ కస్టమర్లు వారి ఉపగ్రహాలు సురక్షితంగా, నిర్దిష్టంగా ఒకటి తరువాత ఒకటిగా ప్రవేశపెట్టినందుకు ఆనందిస్తారని శివన్ పేర్కొన్నారు. తమ తదుపరి కార్యక్రమం జిశాట్ 11 అన్నారు. దాన్ని డిసెంబర్5న ఫ్రెంచి గయాన నుంచి ప్రయోగించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇంతేకాక చాలా కాలంగా ప్రయోగించాలనుకుంటున్న జిశాట్-7ఎను కూడా డిసెంబర్ ప్రయోగించనున్నామన్నారు. వచ్చే సంవత్సరం చంద్రయాన్2ను ప్రయోగించనున్నట్లు కూడా ఆయన తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?