పిఎస్‌ఎల్‌వి సి51 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

బెంగళూరు: పిఎస్‌ఎల్‌వి సి51 ప్రయోగానికి శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రంలో శనివారం ఉద యం 8.54 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఇది పిఎస్‌ఎల్‌వి శ్రేణిలో 53వ కార్యక్రమం. ఇంకా ఈ ప్రయోగం లో ఇస్రో తొలిసారిగా అన్నీ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను ప్రయోగించడం విశేషం. ఈ ప్రయోగంలో బ్రెజిల్‌కు చెంది న అమెజోనియా 1 సహా మరో 18 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇక పిఎస్‌ఎల్‌వి సి51 ప్రయోగం ఆదివారం ఉదయం 10.24 నిమిషాలకు జరగనుంది. వాతావరణ పరిస్థితులనుబట్టి ప్రయోగంలో మార్పులు ఉంటాయి. కాగా, అమెజోనియా ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) తొలి వాణిజ్య ప్రయోగం కావడం గమనార్హం. అమెరికా కేం ద్రంగా పనిచేసే స్పేస్‌ఫ్లుటై ఇంక్‌తో చేసుకున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఎన్‌ఎస్‌ఐఎల్‌ ఈ ప్రయోగం చేపడుతోంది. బ్రెజిల్‌కు చెందిన భూ పరిశీలక ఉపగ్రహం అమెజోనియా ఆ దేశంలో అమెజాన్‌ ప్రాంతంలో అడవులు తగ్గిపోవడం, వ్యవసాయ వైవిధ్యం పై రిమోట్‌ సెన్సింగ్‌ ద్వారా సమాచారం అందిస్తుంది. ఇక మిగిలిన 18 ఉపగ్రహాల్లో 4 ఇండియన్‌ నేషనల్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌కు చెందినవి. వీటిలో మూడు ఉపగ్రహాలు మూడు భారతీయ విద్యాసంస్థలు రూపొందించిన యూనిటీ శాట్స్‌ కాగా, మరొకటి స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా తయారుచేసిన సతీష్‌ ధవన్‌ శాట్‌. 14 ఉపగ్రహాలు ఎన్‌ఎస్‌ఐఎల్‌కు చెందినవి.

DO YOU LIKE THIS ARTICLE?