HomeNewsBreaking Newsపాలకుల విధానాలుప్రజలకు శాపం

పాలకుల విధానాలుప్రజలకు శాపం

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలి : కూనంనేని

ప్రజాపక్షం/భద్రాచలం/కొత్తగూడెం పాలకుల విధానాలు ప్రజలకు శాపంగా మారాయని, సంపన్న వర్గాలకు కొమ్ముగాస్తూ పేదవారిని మరింత పేదలుగా మారుస్తున్నారన్నారని, పోరాటాలు నిర్వహించేది, దేశాన్ని రక్షించుకునేది కమ్యూనిస్టులేనని, మతతత్వ పార్టీ నుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ‘ఇంటింటికి సిపిఐ’ ప్రజా పోరుయాత్ర మంగళవారం పాల్వంచలోకి ప్రవేశించింది. ఈ సందర్బంగా అల్లూరి సెంటర్‌లో యాత్ర బృందానికి స్థానిక పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం శాస్త్రీ సెంటర్‌, నటరాజ్‌ సెంటర్‌, రాజీవ్‌గాంధీ రోడ్‌, మార్కెట్‌ రోడ్‌, బస్టాండ్‌ సెంటర్‌ మీదుగా మోటర్‌ సైకిల్‌ ర్యాలీ అంబేద్కర్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంది. ఈ సభలో కూనంనేని మాట్లాడుతూ పేదవానికి అండగా, వారి సమస్యల కోసం అనునిత్యం పోరాడేది కమ్యూనిస్టులు మాత్రమే అన్నారు.ప్రజాస్వామ్యం, లౌకికవాదం పునాదులపై రూపుదిద్దుకున్న భారతదేశంలో బిజెపి విధానాల కారణంగా ప్రమాదంలో పడిందన్నారు. మతం పేరుతో దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందేందుకు బిజెపి వెంపర్లాడుతోందన్నారు. జిత్తుల మారి బిజెపిని ఇంటికి పంపించడమే లక్ష్యంగా మోడీకో హఠావో దేశ్‌కో బచావో అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష, లౌకిక శక్తులతో కలిసి ప్రజా పోరుయాత్రను సిపిఐ నిర్వహిస్తోందని కూనంనేని తెలిపారు. సిపిఐ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌పాషా మాట్లాడుతూ గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతుందన్నారు. పోడు సాగుదారులందరికీ పట్టాలివ్వాలని, పోడుభూములకు కూడా రైతుబంధు వర్తింపజేయాలని, కెటిపిఎస్‌ యాష్‌పాంట్‌ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సిఎస్‌ఆర్‌ స్కీమ్‌తో ఈ ప్రాంతానికి మేలు చేయాలని అన్నారు. కెటిపిఎస్‌లో ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాధం అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, మున్న లక్ష్మీకుమారి, ఏపూరి బ్రహ్మం, ఆకోజ్‌ సునీల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
అంబసత్రం భూములు లాక్కుంటే ఊరుకోమ్‌
యాత్ర ఇల్లెందు డివిజన్‌ కేంద్రం నుండి ప్రారంభమై టేపారంభమై మండల కేంద్రానికి చేరుకుంది. అక్కడ అరుణ పతాకాన్ని కూనంనేని ఎగురవేశారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి యాత్రబృందం చేరుకోవడంతో వారికి ఘనస్వాగతం పలికారు. అక్కడ జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ అంబసత్రం భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకోమని, అవసరమైతే కౌలు కట్టించుకుని సాగు చేసుకోనివ్వాలని అన్నారు. అనంతరం అక్కడి గ్రామ పెద్దలతో కూనంనేని మాట్లాడుతూ వారి బాగోగులు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం యాత్ర రేగళ్లకు చేరుకుంది. రేగళ్లలో జరిగిన సభలో కూనంనేనితో పాటు సాబీర్‌పాషా మాట్లాడారు. పోడుదారులైన గిరిజన గిరిజనేతరులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రేగళ్ల సర్పంచ్‌ శాంతమ్మ తోపాటు పలువురు సిపిఐ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో వై శ్రీనివాసరెడ్డి, కంచర్ల జమలయ్య, లక్ష్మీపతి, శ్రీనివాస్‌, శివకృష్ణ, సత్యనారాయణ, జమీల్‌పాషా, గోవింద్‌, జర్పుల ఉపేంధర్‌, భవాని,రాజు,జనార్ధన్‌, లాలూ, మోహన్‌, ప్రభు, ప్రసాద్‌, రవి, బిక్కులాల్‌, ఆదినారాయణ, కబీర్‌దాస్‌, బాలు, రామా, రవి, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments