లండన్ : పాక్ ఆటగాళ్లు పోరాడారు.. గెలిచారు… ఆ ఇద్దరే కొట్టేశారు.. బాబర్ ఆజామ్ 100, హరిశ్ సొహైల్ అర్ధ శతకాలతో ప్రేక్షకులను అలరించారు. 6 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికపై న్యూజిలాండ్ నడుమ బుధవారం పోరు సాగింది. ఆరంభంలో పాక్ బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. నీషమ్, గ్రాండ్‌హోమ్ వరుసగా 97, 64 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా అడుగులేసింది. గట్టెక్కింది. స్కోరు బోర్డు పరుగులెట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఎదుట 238 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇదిలా ఉండగా పాక్ బౌలర్లలో ఫాహిద్ అఫ్రిది 3, అమిర్, షాదాబ్ చెరో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ 49.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ బ్యాటింగ్
మార్టిన్ గుప్తిల్ 5 పరుగులు చేసిన తర్వాత అమిర్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. కొలినో మున్రో 12 పరుగుల వద్ద అఫ్రిది బౌలింగ్‌లో హరిస్‌కు క్యాచ్ ఇచ్చాడు. కానె విలియమ్‌సన్ (కెప్టెన్) 41 పరుగుల వద్ద షాదాబ్‌ఖాన్ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుది రిగాడు. రోస్ టేలర్ 3 పరుగులు చేశాక అఫ్రిది బౌలింగ్‌లో సర్ఫరా జ్‌కు దొరికిపోయాడు. టామ్ లాథమ్ (వికెట్ కీపర్) 1 పరుగు చేశాక అఫ్రిది బౌలింగ్‌లో సర్ఫరాజ్‌కు చిక్కాడు. గ్రాండ్‌హోమ్ 64 పరుగుల వద్ద రనౌటయ్యాడు. జేమ్స్ నీషమ్ 97, మిచ్చెల్ శాంతర్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. నిర్ణీత 50 ఓవర్లకుగాను 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేశారు. ఇదిలా ఉండగా పాక్ బౌలర్లలో అఫ్రిది 3, అమిర్ 1, షాదాబ్ ఖాన్ 1 వికెట్ తీశారు.
పాక్ బౌలింగ్..
మహమ్మద్ హఫీజ్ 7 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చాడు. మహమ్మద్ అమిర్ 10 ఓవర్లు వేసి 67 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. అఫ్రిది 10 ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇమాద్ వాసిం 3 ఓవర్లు వేసి 17 పరుగులిచ్చాడు. షాదాబ్‌ఖాన్ 10 ఓవర్లు వేసి 43 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. వాహాబ్ రియాజ్ 10 ఓవర్లు వేసి 55 పరుగులిచ్చాడు.
పాక్ బ్యాటింగ్
ఇమామ్ 19 పరుగుల వద్ద ఫెర్గూసన్ బౌలింగ్‌లో గుప్తిల్‌కు క్యాచ్ ఇచ్చాడు. జామాన్ 9 బౌల్ట్ బౌలింగ్‌లో గుప్తిల్‌కు దొరికిపోయాడు. మహమ్మద్ హఫీజ్ 32 పరుగుల వద్ద విలియమ్‌సన్ బౌలింగ్‌లో ఫెర్గూసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. హరిశ్ సొహైల్ 68 పరుగుల వద్ద రనౌటయ్యాడు. బాబర్ ఆజామ్ 101, సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్, వికెట్ కీపర్) 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇదిలా ఉండగా 49.1 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేశారు. ఇదిలా ఉండగా బౌల్ట్, ఫెర్గూసన్, విలియమ్‌సన్ చెరో వికెట్ తీశారు.
న్యూజిలాండ్ బౌలింగ్..
బౌల్ట్ 10 ఓవర్లు వేసి 48 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. హెన్రి 7 ఓవర్లు వేసి 25 పరుగులిచ్చాడు. ఫెర్గూసన్ 8 ఓవర్లు వేసి 43 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. గ్రాండ్‌హోమ్ 2 ఓవర్లు వేసి 12 పరుగులిచ్చాడు. మిచ్చెల్ శాంతర్ 10 ఓవర్లు వేసి 38 పరుగులిచ్చాడు. జేమ్స్ నీషమ్ 3ఓవర్లు వేసి 20 పరుగులిచ్చాడు. కానె విలియమ్‌సన్ (కెప్టెన్) 8 ఓవర్లు వేసి 39 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కొలినో మున్రో 1 ఓవరు వేసి 9 పరుగులిచ్చాడు.
పాక్ విజయం
RELATED ARTICLES