పలు ప్రాంతాల్లో భారీ వర్షం

ఖమ్మం జిల్లా ఏన్కూరులో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షం
మరో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

ప్రజాపక్షం/హైదరాబాద్‌  : రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురిసాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా ఏన్కూరులో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. యాదాద్రి జిల్లా రామన్నపేటలో 9 సెంటీమీటర్లు, భూపాలపల్లి జిల్లా వెంకటాపురంలో 8, ఖమ్మం జిల్లా తొల్లడ, జగిత్యాల, ఖమ్మం జిల్లా కొంజరలలో 6, యాదగిరిగుట్ట, కొడంగల్‌లలో 5, కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, సూర్యాపేటలలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సముద్ర నీటి మట్టానికి 2.1కిలోమీటర్ల ఎత్తున బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం చోటు చేసుకుంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాలలో రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?