రావల్పిండి: పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు పరుగుల సునామీతో హోరెత్తిపోయింది. ఏకంగా 1,768 పరుగులు నమోదైన ఈ టెస్టును ఇంగ్లాండ్ 74 పరుగుల తేడాతో గెల్చుకుంది. విజయానికి 343 పరుగులు చేయాల్సి ఉం డగా, పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది. పాక్‌లో 17 ఏండ్ల తర్వాత తొలిసారి టెస్టు సిరీస్ కోసం వచ్చిన ఇంగ్లాండ్ విజయంతో బోణీ కొట్టింది. భారీ స్కోర్లు నమోదు కావడంతో, ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా ఫలితం వెలువడింది. స్వదేశంలో పాకిస్తాన్‌కు ఓటమి తప్పలేదు. చివరిరోజు ఆద్యంతం ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్ లో పలు పాత రికార్డులు బద్దలయ్యాయి. ఒక టెస్టులో అత్యధిక పరుగులు నమోదవడం పాకిస్తాన్‌లో ఇదే ప్రథమం. ఇరు జ ట్ల బ్యాట్స్‌మన్ ఈ మ్యాచ్‌లో సెంచరీలతో చెలరేగిపోయారు. ఇంగ్లాండ్ తరఫున నలుగురు, పాక్ జ ట్టులో ముగ్గురు చొప్పున శతకాలు సాధించారు. గతంలో టెస్టులకు ఒక నిర్ణీత గడువు అంటూ ఉండేది కాదు. ఫలితం తేలే వరకూ ఆడేవారు. లేదా ఇరు జట్లు డ్రాకు అంగీకరిస్తే మ్యాచ్‌ని ము గించేవారు. ఆతర్వాత కాలంలో ఆరు రోజుల టె స్టులు అమల్లోకి వచ్చాయి. అనంతరం రెస్ట్ డేను రద్దు చేయడంతో ఐదు రోజులకు మారింది. ఈ విధంగా ఐదు రోజుల మ్యాచ్‌గా టెస్టు రూపు దిద్దుకున్న తర్వాత ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా ఇంగ్లాండ్ చరిత్ర పుటల్లో చోటు సంపాదించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు నమోదైన సందర్భా లు రెండు ఉన్నాయి. 1939లో కింగ్స్‌మీడ్ మైదా నం వేదికగా ఇంగ్లాండ్, -సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో 1981 పరుగులు నమోదయ్యా యి. సౌతాఫ్రికా రెండు ఇన్నింగ్స్‌లలో 530, 481 చొప్పున పరుగులు చేయగా ఇంగ్లాండ్ 316, 654 పరుగులు సాధించింది. ఆ మ్యాచ్ లో ఇరు జట్ల బౌలర్లు 35 వికెట్లు తీసినా మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ కంటే ముందు, 1930లో సబీనా పార్క్ వేదికగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 1,815 పరుగులు నమోదయ్యాయి. ఈ టెస్టులో వెస్టిండీస్ 286, 408 చొప్పున రన్స్ చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇ న్నింగ్స్‌లో 849, రెండో ఇన్నింగ్స్‌లో 272 చొప్పు న పరుగులు సాధించింది. ఇరు జట్ల బౌలర్లు కలిసి 34 వికెట్లు పడగొట్టారు. కానీ ఫలితం తేలలేదు. అయితే ఈ రెండు మ్యాచ్‌లు 9 రోజు జరిగాయి. కానీ పాకిస్తాన్ – ఇంగ్లాండ్ మధ్య రావల్పిండి టెస్టు 5 రోజుల్లోనే ముగిసింది. బౌలర్లు కూడా 37 వికె ట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలింది. కాగా, పాకిస్తాన్ లో అత్యధిక పరుగులు నమోదైన టెస్టు గా గతంలో ఉన్న భారత్, -పాక్ మ్యాచ్ రికార్డును తాజా మ్యాచ్ బ్రేక్ చేసింది. 2006లో ఫైసలాబాద్‌లో భారత్, పాక్ జట్టు కలిసి 1,702 పరుగులు చేశాయి. ఇలావుంటే, ఒక టెస్టు మ్యాచ్ తొలి రోజే ఒక జట్టు 500 ప్లస్ (506) పరుగులు చేయడం ఇదే ప్రథమం. ఇంగ్లాండ్ ఈ ఫీట్ సాధించింది. గతంలో, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఆస్ట్రేలియా 494 పరుగులు సాధించింది. ఒక టెస్టులో రెండు జట్ల ఓపెనర్లు సెంచరీలు చేయడం కూడా ఇదే ప్రథ మం. ఈ మ్యాచ్‌లో జాక్ క్రాలే, బెన్ డకెట్ ఇం గ్లాండ్ తరఫున సెంచరీలు చేశారు. పాక్ ఓపెనర్లు షఫీక్, ఇమామ్ ఉల్ హక్ లు శతకాలు నమోదు చేశారు. ఒత్తం మీద ఈ భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయభేరి మోగించింది.
సంక్షిప్త స్కోర్లు..
ఇంగ్లాండ్ : తొలి ఇన్నింగ్స్‌లో 657 ఆలౌట్,
పాకిస్తాన్ : తొలి ఇన్నింగ్స్‌లో 579 ఆలౌట్, ఇంగ్లాండ్ : రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 264 డిక్లేర్డ్ (పాక్ ఎదుట 343 పరుగుల లక్ష్యం)
పాకిస్తాన్ : రెండో ఇన్నింగ్స్‌లో 268 ఆలౌట్, ఫలితం : 74 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం.
‘పరుగుల సునామీ’ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం
RELATED ARTICLES