తహసీల్దార్ కార్యాలయం ముందే రైతు ఆత్మహత్య
పెద్దజిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లో ఘటన
ప్రజాపక్షం/ పెద్దపల్లి / హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘట న శనివారం జరిగింది. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజిరెడ్డి తనకున్న ఎకరం 20 గుంటల భూమిని తన పేరు మీద నమోదు చేయడం లేదని మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తహసీల్దార్, విఆర్‌ఒల పేర్లను సూ సైడ్ నోట్లో రాసి రాజారెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. సమాచారం అందుకు న్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరా లు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది. ఎంఆర్ఓ, విఆర్ఒలను సస్పెండ్ చేయాలి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి ఆత్మహత్యకు కారకులైన ఎంఆర్ఒ, విఆర్ఒలను సస్పెండ్ చేయాలని తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. తనకున్న ఎకరం 20 గంటల భూమిని తన పేరుతో రికార్డ్ చేయాలని కోరినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన రైతు మందల రాజిరెడ్డి కాల్వ శ్రీరాంపూర్ ఎంఆర్ఒ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని, తన మరణానికి కాల్వశ్రీరాంపూర్ ఎంఆర్ఒ వేణుగోపాల్, విఆర్ఒ గురుమూర్తి, మరో విఆర్ఒ స్వామి ముగ్గురు కారకులని పేర్కొన్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ముగ్గురు రెవెన్యూ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, సమగ్ర దర్యాప్తు జరపాలని ఆమె డిమాండ్ చేశారు. రైతు మందల రాజిరెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక కోటి రూపాయల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని పశ్య పద్మ కోరారు.
పట్టా కోసం అలసి సొలసి…!
RELATED ARTICLES