రికీ పాంటింగ్
సిడ్నీ: భారత యువ సంచలనం రిషభ్ పంత్ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా (159) పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అసాధారణ ఇన్నింగ్స్‌తో చెలరేగిన పంత్‌పై భారత్‌లోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా ఈ యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై ప్రశంసల జల్లు కురుపించాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో పంత్ ఆడిన ఇన్నింగ్స్ చాలా అద్భుతమని పాంటింగ్ అన్నాడు. పంత్ దూకుడైన బ్యాటింగ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను తలపిస్తున్నదని, చాలా కాలం తర్వాత వికెట్ కీపర్ దార ఇలాంటి ఇన్నింగ్స్‌ను చూడటం ఆనందంగా ఉందని పాంటింగ్ అన్నాడు. ఇతర బ్యాట్స్మెన్ల కంటే పంత్ బ్యాటింగ్ స్టయిల్ డిఫరెంట్ ఉంటుందని, తన ముందు ఏ బౌలర్ ఉన్న సరే భారీ షాట్లు ఆడగల సత్తా పంత్‌కు ఉందని పాంటింగ్ కొనియాడాడు. పంత్‌లో అపారమైన ప్రతిభ, నైపుణ్యం దాగిఉందని ఈ ఇన్నింగ్స్‌తో పంత్ నిరూపించుకున్నాడని చెప్పాడు. తొమ్మిది టెస్టుల్లోనే రెండు సెంచరీలు సాధించి పంత్ తన దూకుడును చాటుకున్నాడని, సుదీర్ఘ కాలం ఈ ఫార్మాట్ ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ కేవలం ఆరు సెంచరీలు మాత్రమే సాధించాడని, రానురాను ధోనీ రికార్డులను కూడా చెరిపేసే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయని పాంటింగ్ అన్నాడు. ప్రస్తుతం దాదాపు 21 ఏళ్ల వయసులోనే ఉన్న పంత్ భారత్‌కు సుదీర్ఘ కాలం సేవలందిచడం ఖాయమని పాంటింగ్ పేర్కొన్నాడు. వన్డే, టి20ల్లో ధోనీ రిటైర్మెంట్ తర్వాత పంత్ అన్ని ఫార్మాట్లలో ఆడుతాడని పాంటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ప్రపంచకప్‌లో పంత్‌ను ఆడించాలి: గంగూలీ
ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో పంత్‌ను కూడా ఆడించాలని భారత మాజీ సారథి సౌరభ్ గంగూలీ పేర్కొన్నాడు. ఆసీస్ గడ్డపై తొలి పర్యటనలో అద్భుతమైన బ్యాటింగ్‌తో సత్తా చాటుతున్న చిచ్చరపిడుగు రిషభ్‌పంత్‌పై గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. వికెట్ కీపింగ్‌లోనూ రాణిస్తున్న పంత్‌ను వన్డే ప్రపంచకప్‌లో పంత్‌ను నాలుగో నెంబర్లో బ్యాటింగ్‌కు దింపాలని గంగూలీ సూచించాడు. మొదటి రెండు స్థానాల్లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లను కొనసాగించాలని, మూడో నెంబర్లో విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడని చెప్పాడు. తర్వాత నాలుగో నెం.లో బ్యాటింగే భారత్‌కు కలిసి రావటంలేదు. ఈ స్థానంలో అంబటి రాయుడు, కేదర్ జాదవ్, ధోనీలు ఆ స్థాయిలో రాణించలేక పోతున్నారు. అందుకే ప్రపంచకప్‌లో పంత్‌ను నాలుగో నెంబర్లో ఆడిస్తే భారత్‌కు తిరిగే ఉండదని గంగూలీ పేర్కొన్నాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో పంత్ ఆడిన తీరు అమోఘమని దాదా అన్నాడు. రానున్న రోజుల్లో పంత్ మహీను కూడా దాటేస్తాడు అని అనడంలో సందేహం లేదని గంగూలీ చెప్పాడు. టీమిండియాకు పంత్ రూపంలో గొప్ప ఆటగాడు దొరికాడని గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు.
పంత్ గిల్‌క్రిస్ట్‌ను తలపిస్తున్నాడు
RELATED ARTICLES