కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
సంక్రాంతి పండగ ప్రయాణికుల రద్దీ
తమ స్వస్థలాలకు బయలుదేరిన ప్రజలు
అందుబాటులో ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు, దక్షిణ మధ్య రైల్వే జనసాధారన్ రైళ్లు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ, టోల్ ప్లాజా అదనపు కౌంటర్ల ఏర్పాటు
అదనపు బస్సులు, రైళ్లు వేయాలని ప్రజల విజ్ఞప్తి
ప్రజాపక్షం/హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భం గా ప్రజలు తమ స్వస్థలాలకు బయలుదేరి వెళుతున్నా రు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల కు శనివారం, ఆదివారం సెలవులు, సోమవారం ఆప్షన ల్ హాలీడే, మంగళవారం పండగతో వరుస సెలవులు రా వడంతో శుక్రవారం రాత్రి నుంచే జ్రలు తమ సొంతూళ్ల కు ప్రయాణాలు మొదలుపెట్టారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. పండగ రద్దీ దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సౌకర్యార్థం టిఎస్‌ఆర్‌టిసి, ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు ఏర్పా టుచేశాయి. దక్షిణ మధ్య రైల్వే కూడా సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగడంలేదు కానీ, సాధారణ ప్రయాణికులకు మాత్రం తిప్పలు తప్పడంలేదు. అయితే ప్ర యాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆర్‌టిసి బస్సులు, దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు సరిపోవడం లేదని, అదనంగా బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనావేస్తూ వారి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌టిసి అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్- జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతున్నది. టోల్‌ప్లాజాల దగ్గర వాహనాలు మెల్లగా కదులుతున్నా యి. ఈ నేపథ్యంలో టోల్‌ప్లాజా సిబ్బంది అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసింది.
అత్యధిక రైళ్లు నడుపుతున్నాం: ఎస్‌సిఆర్
సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్వస్థలాకు వెళ్ళే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకి పెరగడం కనిపిస్తుండడంతో రిజర్వేషన్ రైళ్లతో పాటు ప్రత్యేక జనసాధారన్ రైళ్లను కూడా నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సిఆర్) ప్రకటించింది. వచ్చే పది రోజుల్లో రైలు ప్రయాణికుల సంఖ్య మరింత అధికమౌతుందనే అంచనాలతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో రద్దీని అధిగమించేందుకు సాధ్యమైనన్ని క్కువ రైళ్ళు నడపడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నదని ఎస్‌సిఆర్ తెలియజేసింది.