49 ఏళ్ల తర్వాత విదేశంలో సిరీస్ గెలుచుకున్న కివీస్
మూడో టెస్టులో పాకిస్థాన్ ఓటమి
అబుదాబి: పాకిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్ 2 కైవసం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టెస్టులో పాకిస్థాన్ 123 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో న్యూజిలాండ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మూడో టెస్టులో పా క్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్ 49 ఏళ్ల తర్వాత వి దేశీ గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేసుకుంది. కివీస్ చివరి సారిగా పాకిస్థాన్‌తో 1969లో జరిగిన టెస్టు సిరీస్‌ను 1 గెలుచుకుంది. తాజాగా 49 ఏళ్ల నిరీక్షణ అనంతరం విదేశంలో తొలి సిరీస్‌ను గెలుచుకుని కొత్త రికార్డు సృ ష్టించింది. తొలి టెస్టులో పాకిస్థాన్‌పై నాలుగు ప రుగులతో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న కివీస్ ఆ తర్వాత రెండో టెస్టులో ఇన్నింగ్స్ 16 పరుగులతో ఓటమిపాలైంది. శుక్రవారం 280 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ కివీస్ బౌలర్ల ధాటికి విలవిలలాడింది. ఆ రంభం నుంచే దూకుడును కనబర్చిన కివీస్ బౌల ర్లు వరుసవిరమాల్లో వికెట్లు తీస్తూ పాక్‌ను కట్టడి చేశారు. బాబర్ ఆజమ్ (51; 114 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (28), ఇమాముల్ హక్ (22), బిలాల్ తప్ప మిగతా బ్యాట్స్‌మన్లు రెండంకెళ్ల స్కోరు మార్కును కూడా దాటలేక పోయారు. దీంతో పాకిస్థాన్ 56.1 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలడంతో న్యూజిలాండ్‌కు 123 పరుగుల భారీ విజయం దక్కింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియమ్ సోమర్‌విల్లె తలో మూడో వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు 272/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం చివరి రోజు బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఆదిలోనే కెప్టెన్ విలియమ్సన్ వికెట్‌ను కోల్పోయింది. తర్వాత హెన్రీ నికొలాస్ శతకం సాధించి తమ జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న మరోవైపు నికొలాస్ ధాటిగా ఆడడంతో కివీస్ భారీ స్కోరు సాధించింది. మ్యాచ్ చివరి రోజు కావడంతో 353/7 పరుగుల వద్ద న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. పాక్ ముందు 280 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన నికొలాస్ 266 బంతుల్లో 12 ఫోర్లతో 126 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో యాసిర్ షా 4 వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్స్‌లలో మొత్తం (223) పరుగులు చేసిన కివీస్ సారథి కెన్ విలియమ్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ అమాంతం బౌలింగ్‌తో ఆకట్టుకున్న పాక్ స్పిన్నర్ యాసిర్ షాకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
న్యూజిలాండ్‌దే టెస్టు సిరీస్
RELATED ARTICLES