న్యూఢిల్లీ: భారత్ నావికాదళం బలాన్ని పెంచేందుకు 56 కొత్త యుద్ధ నౌకలను, ఆరు జలాంతర్గాములను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న తొలి విమానవాహక యుద్ధ నౌక నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని నావికాదళ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబ సోమవారం చెప్పారు. నావికా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు. త్రిదళాల సమాహారం, ఉమ్మడితనం విషయంలో చాలా పురోగతి సాధించినట్లు చెప్పారు. ఇదే సమయంలో థియేటర్ కమాండ్స్కు భారత వాయుసేన వ్యతిరేకత చాటుతోందన్నారు. అడ్మిరల్ సునీల్ లంబ విలేకరుల సమావేశంలో దాదాపు 70 నిమిషాలు ప్రసంగించారు. తమ దళంలో ఆధునీకరణ సాధిస్తున్నట్లు చెప్పారు. నావికా బలంలో చైనా చాలా వేగంగా విస్తరిస్తోందన్నారు. ‘2050 నాటికి మన బలగంలో కూడా 200 నౌకలు, 500 విమానాలు ఉంటాయని, ప్రపంచ స్థాయి నావికాదళంగా ఎదుగుతాం’ అని చెప్పారు. ప్రస్తుతం భారత షిప్యార్డ్లలో 32 నౌకలు, జలాంతర్గాముల నిర్మాణపనులు జరుగుతున్నాయన్నారు. వీటికి అదనంగా 56 నౌకలను, ఆరు జలాంతర్గాములను ప్రభుత్వం ఆమోదించింది.
నౌకాదళంలోకి ప్రవేశపెట్టనున్న 56 కొత్త యుద్ధ నౌకలు
RELATED ARTICLES