అధికారపక్ష నేతగా ప్రచండ
ఖాఠ్మాండూ: నేపాల్ అధికారపక్ష నేతగా పుష్పకమల్ దహల్ ప్రచండ ఎన్నికయ్యారు. రా జ్యాంగ విరుద్ధంగా ప్రజా ప్రతినిధుల సభను రద్దు చేసినందుకు క్రమశిక్షణ చర్యగా ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి ని పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో కొత్త పార్లమెంటరీ పార్టీ నాయకునిగా ప్రచండను ఎన్నుకోవడం తో నేపాల్లో రాజకీయ సంక్షోభం క్లుమైక్స్కు చేరినట్టుంది. రద్దున ప్రజా ప్రతినిధుల సభను పునరుద్ధరించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రచండ ఈ సందర్భంగా చెప్పారు. న్యూ బనేశ్వర్లోని పార్లమెంటు భవనంలో బుధవారంనాడు జరిగిన సమావేశంలో అధికారపక్షంలోని మెజార్టీవర్గం నాయకుడు, నేపాల్ కమ్యూనిస్టుపార్టీ (ఎన్.సి.పి) కార్యనిర్వాహక ఛైర్మన్ ప్రచండను పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఎన్నుకున్నా రు. ఓలి నాయకత్వంలోని సి.పి.ఎన్-యు ఎం ఎల్ పార్టీ, ప్రచండ నాయకత్వంలోని సి.పి.ఎన్-మావోయిస్టు సెంటర్ పార్టీలు 2018 మే నెలలో విలీనమై అధికారపార్టీగా ఆవిర్భవించాయి. అధికారం కోసం ఓలి-ప్రచండ మధ్య జరుగుతున్న అంతర్గత పోరులో భాగంగా డిసెంబరు 20న ప్రజాప్రతినిధుల సభ రద్దుకు దిగడంతో నేపాల్ రాజకీయం సంక్షోభంలో కూరుకుపోయింది. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థను, పార్లమెంటును, దాని పనితీరును కాపాడుకోవడానికి అన్ని రాజకీయ శక్తులను, పార్టీలను ఏకం చేస్తానని ప్రచండ అన్నారు. పార్లమెంటరీ పార్టీ నేతగా తనను ఎన్నుకున్నందుకు సెంట్రల్ కమిటీ సమావేశంలో తన మెజార్టీ వర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సవాళ్ళు ఎదురైన ఈ సమయంలో చాలా పెద్ద బాధ్యతను తనకు అప్పగించారని ఆయన అన్నారు. సినీయర్ నాయకుడు మాధవ్కుమార్ నేపాల్ సమావేశంలో తొలుత ప్రచండ పేరును పార్లమెంటరీపార్టీ నేతగా ప్రతిపాదించారు. తమకు మెజార్టీ ఉందని, తమకే అధికార గుర్తింపు ఇవ్వాలని ఎన్నికల సంఘానికి ప్రచండ నాయకత్వంలోని వర్గం ఎన్నికల సంఘాన్ని కోరినట్టు ‘మై రిపబ్లికా’ పత్రిక తెలియజేసింది. ఇదిలా ఉండగా, బుధవారంనాడు అంతకుముందు పార్లమెంటును రద్దుచేసినందుకు ప్రధానమంత్రి ఓలికి వ్యతిరేకంగా దాఖలైన 12 రిట్ పిటిషన్లనన్నింటినీ విచారణకు సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. శుక్రవారంనాడు ఈ విచారణ ప్రారంభమవుతుంది.
నేపాల్ సంక్షోభం క్లుమైక్స్కు..
RELATED ARTICLES