ప్రచండ ప్రభుత్వానికి యుఎంఎల్ మద్దతు ఉపసంహరణ
కఠ్మండు : నేపాల్‌లో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో చిచ్చు రేగింది. పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ ప్రభుత్వానికి ఆ దేశ మాజీ ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి నాయకత్వానగల సిపిఎన్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవాలని సోమవారం నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ కేంద్ర ప్రచా ర విభాగ కమిటీ డిప్యూటీ చీఫ్ బిష్ణు రిజాల్ పిటిఐ వార్తాసంస్థకు ఈ విషయం చెప్పారు. అయితే కూటమి నుండి ఈ పార్టీ వైదొలగడంవల్ల ప్రపండ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదు. ప్రభుత్వం కొనసాగడానికి 138 సభ్యుల మద్దతు అవసరం. సిపిఎన్ మద్దతు (79) ఉపసంహరించాక కూడా ప్రచండకు పార్లమెంటులో 141 మంది ఎంపిల మద్దతు ఉంటుంది. నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన 89 మంది,ఆర్‌ఎస్‌పికి చెందిన 20 మంది, ప్రచండపార్టీకి చెందిన 32 మంది సంఖ్యాబలం ప్రభుత్వానికి మద్దతుగా ఉంది. నేపాల్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలలో రాజకీయ సమీకరణలలో మార్పులు చేర్పులు సంభవించిన పూర్వరంగంలో ప్రచండ సారధ్యంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. నేపాల్ పార్లమెంటులో సిపిఎన్ రెండవ అతిపెద్ద పార్టీ. ప్రపంచ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకుని రెండు నెలలు మాత్రమే గడిచింది. సిపిఎన్ పార్టీ నేత కె.పి.శర్మ ఓలి అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయీ సమావేశం జరిగింది. సంకీర్ణ ప్రభుత్వం నుండి బయటకు వచ్చేయాలని సమావేశం నిర్ణయించింది. ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ గత ఏడాది డిసెంబరు 25న జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఓలి అన్నారు. నేపాలీ దేశాధ్యక్ష పదవికి నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన రామ్ చంద్ర పౌద్వాల్‌ను అధికార కూటమి తరపు అభ్యర్థిగా ప్రచండ నిర్ణయం తీసుకోవడంతో ఓలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌద్వాల్ అధికార కూటమికి వెలుపల ఉన్నారు. దేశ అధ్యక్ష పదవికి మార్చి 9వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఏడు పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ప్రచండ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తమ పార్టీకి ఆయన ద్రోహం చేశారని ఓలి విమర్శించారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో ఉన్న సిపిఎన్ కు చెందిన ఉప ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి బిష్ణు పౌడ్యాల్, విదేశాంగమంత్రి బిమల్ రాయ్ పౌడ్యాల్ 2022 డిసెంబరు 26న ప్రచండ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సహా ఇతర మంత్రలు ప్రధానమంత్రికి రాజీనామాలు సమర్పించడానికి సన్నద్ధమవుతున్నారు. తాము బలవంతంగా కూటమిని వదిలివెళ్ళిపోయేవిధంగా ప్రచండ ఒత్తిడి చేసే జిమ్మిక్కులు ప్రదర్శించారని యుఎంఎల్ వైస్ ఛైర్మన్ బిష్ణు ప్రసాద్ పౌడ్యాల్ విమర్శించారు. నేపాలీ పార్లమెంటు దిగువసభలో 275 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ నిర్వహణకు 138 సీట్ల మెజారిటీ ఉండాలి. పార్లమెంటులో సిపిఎన్ పార్టీకి 79 సీట్లు ఉన్నాయి. కె.పి.శర్మ ఓలి నాయకత్వానగల సిపిఎన్ పార్టీకి అందరికంటే అత్యధికంగా నిష్పత్తి ప్రాతిపదికపై ఓట్లతో రెండోస్థానంలో ఉంది.
నేపాల్‌లో ఎన్నికల చిచ్చు
RELATED ARTICLES