నేడు కృష్ణా నదీ జలాల బోర్డు సమావేశం

రేపు గోదావరి బోర్డు కూడా…
ప్రజాపక్షం/హైదరాబాద్‌; కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు గురువారం సమావేశం కానుండగా, మరుసటి రోజు శుక్రవారం గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. సాగునీటి ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాలు పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో రెండు బోర్డులు వేర్వేరుగా సమావేశం కానున్నాయి. కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు భేటీలో ఐదు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే గోదావరి యాజమాన్య బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఫిర్యాదు అంశంపైన చర్చించే అవకాశం ఉన్నది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం మళ్లీ తెరపైకి రావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.

DO YOU LIKE THIS ARTICLE?