ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం పార్లమెంటులో శుక్రవారం (ఫిబ్రవరి 1న) బడ్జెట్ ప్రవేశపెడుతున్నది. కాకపోతే ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. మరో మూడు మాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జర గనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ పూర్తిస్థాయి ఎన్నికల తాయిలాల బడ్జెట్ అవుతుందని విశ్లేషకులు భావి స్తున్నారు. అన్ని వర్గాలకు ఇష్టానుసారం హామీలు ఈ బడ్జెట్లో కన్పిస్తాయిని అంచనా. కాగా, పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు అది సమర్పించడానికి ఒక రోజు ముందు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇలా స్పష్టీకరించడం ఇది రెండోసా రి. అఖిలపక్ష సమావేశానంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ అజాద్ విలేకరులతో ‘ప్రధాని నరేంద్ర మోడీ మాతో శుక్రవారం ప్రభుత్వం తా త్కాలిక బడ్జెట్‌నే సమర్పించనున్నట్లు చెప్పారు’అని తెలిపారు.