2,51,606 మంది విద్యార్థులు దరఖాస్తు
ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ప్రజాపక్షం/హైదరాబాద్
ఎంసెట్ పరీక్షలకు జెఎన్‌టియు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసింది. బుధవారం నుంచి ప్రారంభమై ఈ నెల 5,6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ మొత్తం ఆరు సెషన్స్‌లో, 9,10వ తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ మూడు సెషన్స్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఎంసెట్‌కు 2,51,606 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్ 1,64,962 మంది.. అగ్రి, మెడికల్ స్ట్రీమ్ 86,644 మంది ఉన్నారు. మొత్తం 105 పరీక్ష కేంద్రాలలు ఉండగా ఇందులో రాష్ట్రంలో 82, ఆంధ్రలో 23 ఉన్నాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌పై ఉన్న పరీక్ష కేంద్రాన్ని, ప్రాంతాన్ని ఒకటికి రెండు సార్లు క్షుణ్నంగా చదువుకోవాలని, చివరి క్షణంలో అయోమయానికి గురికావొద్దని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్దన్ తెలిపారు. రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఒక నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రానికి అనుమతి ఇవ్వబోమని జెఎన్‌టియు స్పష్టం చేసింది. అలాగే కొవిడ్- జాగ్రత్తలు తీసుకోవాలని, షానిటైజ్, మాస్కులను ధరించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద గుంపుగా ఉండకుండా భౌతిక దూరం పాటించాలని జెఎన్‌టియు సూచించింది.
నేటి నుంచి ఎంసెట్
RELATED ARTICLES