హంద్రీనీవా నుంచి ఎపి కృష్ణా జలాలు తీసుకోకుండా చూడండి
కృష్ణాబోర్డ్కు తెలంగాణ ప్రభుత్వం లేఖ
ప్రజాపక్షం/హైదరాబాద్ కృష్ణా జల వివాదాల రెండో ట్రిబ్యునల్ నీటి వాటాలను తేల్చే వరకు హంద్రీనీవా సుజలస్రవంతి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీరు తీసుకోకుండా నిలువరించాలని తెలంగాణ రాష్ట్రం కృష్ణానదీ యాజమాన్య బోర్డ్‌ను కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇఎన్సి మురళీధర్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌కు లేఖ రా శారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాటాలు ఖరా రు చేసే వరకు హంద్రీనీవా నుంచి నీటిని తరలించకుండా ఆంధ్రప్రదేశ్‌ను నిలువరించాలన్నారు. వరద జలాలపై ఆధారపడి నిర్మించిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తోందని, తద్వారా బేసిన్‌లోని తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులు నష్టపోతాయని తెలిపారు. నది ఒడ్డున ఉన్న తెలంగాణ ప్రాంతాలను కాదని బేసిన్ వెలుపల 700 కిలోమీటర్ల దూరానికి నీటిని తరలించడం అన్యాయమని తెలిపారు. హంద్రీనీవా సుజలస్రవంతి నుంచి తుంగభద్ర హైలెవల్ కెనాల్ తదితర ప్రాజెక్టులకు బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తున్నందున బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు కూడా చేయలేదని గుర్తు చేశారు. అలా నీటిని తరలించడం ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకమని పేర్కొన్నారు. మిగులు జలాలపై ఆధారపడి బేసిన్ వెలుపలకు నీటిని తీసుకెళ్లే హంద్రీనీవా ప్రాజెక్టునే తాము వ్యతిరేకిస్తుంటే, మరో వైపు సామర్థ్యాన్ని 3850 నుంచి 6300 క్యూసెక్కులకు పెంచడం అక్రమమని ఆ లేఖలో పేర్కొన్నారు. వరద జలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని కోరితే, ఆంధ్రప్రదేశ్ మాత్రం విజ్ఞప్తి చేయడం లేదన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలాశయం జలవిద్యుత్‌కు ఉద్దేశించిందని, అక్కడి నుంచి కష్ణా బేసిన్ వెలుపలకు నీటి తరలింపునకు ట్రైబ్యునల్ అనుమతించలేదని మురళీధర్ వివరించారు.
నిలువరించండి
RELATED ARTICLES