HomeNewsTelanganaనిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

మంత్రులు సీతక్క, కొండా సురేఖ
ప్రజాపక్షం/ములుగు జిల్లా ప్రతినిధి మేడారం జాతర పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మంత్రులు సీతక్క, కొండా సురేఖలు అన్నారు. మేడారం ప్రాంతాన్ని బుధవారం మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క), కొండా సురేఖలు సందర్శించారు. వారిని పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు ఎత్తు బంగారం అందజేసి మొక్కులు చెల్లించారు. అనంతరం విలేకరుల మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క సారక్కల జాతర ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరగనుండగా, జాతరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులు కేటాయించింది. ఆ పనులు సక్రమంగా
జరగాలని నిర్లక్ష్యం వహించరాదని, జాతర పనుల్లో అధికారుల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మంత్రులు అన్నారు. జాతరకు దేశ నలుమూలల నుండి దాదాపు రెండు కోట్లకు పైగా భక్తులు వస్తారని సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారని అన్నారు. వచ్చిన భక్తులందరికి ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అందువలన ప్రతి ఒక్క అధికారి నిర్లక్ష్యం వహించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు అన్ని విధాలుగా బాత్రూమ్‌లు, త్రాగునీరు, బట్టలు మార్చుకునేందుకు షెడ్లు వంటి సౌకర్యాలు అధికారులు చేపట్టాలని, అలాగే మేడారం జాతరకు దాదాపు రెండు కోట్ల భక్తులు వస్తుంటారని, వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా చూడాలన్నారు. మంత్రుల వెంట ఎండోమెంట్‌ శాఖ స్టేట్‌ డైరెక్టర్‌ సురేష్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్‌పి అంబరీష్‌, జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీజ, వేణుగోపాల్‌రెడ్డి, ఐటిడిఏ పిఓ అంకిత్‌, డిఎఫ్‌ఓ రాహుల్‌ కిషన్‌ జాదూతో పాటు జిల్లా అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments