నామినేషన్‌ ముగిసింది పోరు మిగిలింది

రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి నియోజకవర్గాల్లో ఎన్నికల వేడి
గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో నామిషన్లు దాఖలు
దాదాపు సగం రాష్ట్రంలో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన రాజకీయ పార్టీలు
నల్లగొండ-వరంగల్‌ పట్టభద్రుల స్థానంలో వామపక్షాల అభ్యర్థి జయసారథిరెడ్డి ప్రచార జోరు
ప్రజాపక్షం న్యూస్‌ నెట్‌వర్క్‌ రాష్ట్రంలో జరుగనున్న రెండు పట్టభద్రుల నియో జకవర్గ ఎంఎల్‌సి ఎన్నికలకు నామినేషన్లు పోటె త్తాయి. నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియగా రెండు నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్య లో నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మంగళ వారంతో ముగిసింది. మహబూబ్‌నగర్‌ రంగా రెడ్డి- పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాని కి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యాయి. రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడం గమనార్హం. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి నల్లగొండ- పట్టభద్రుల స్థానా నికి వామపక్షాల అభ్యర్థిగా జయసారథిరెడ్డి మంగళవారం భారీ ప్రదర్శనగా వెళ్ళి నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా ఇదే నియోజకవర్గం నుంచి టిజెఎస్‌ పార్టీ నుంచి ప్రొఫెసర్‌ ఎం. కోదండరామ్‌, కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాములు నాయక్‌, బిజెపి నుంచి జి.ప్రేమేందర్‌రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ నుంచి చెరుకు సుధాకర్‌, యువ తెలంగాణ తరుపున రాణరుద్రమరెడ్డి పోటీలో ఉన్నారు. మరోవైపు హైదరాబాద్‌- రంగారెడ్డి స్థానం నుంచి వామ పక్షాలు బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్థిగా ఫ్రొపెసర్‌ నాగేశ్వర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. టిఆర్‌ఎస్‌ నుంచి మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి, బిజెపి నుంచి సిట్టింగ్‌ ఎంఎల్‌సి ఎన్‌. రామ చంద్రరావు, కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి డాక్టర్‌ జి.చిన్నారెడ్డి, టిడిపి నుంచి పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎల్‌.రమణ పోటీ పడుతు న్నారు. బుధవారం నామినేషన్‌ల పరిశీలన, 26న ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయిం చారు. మార్చి14న ఉదయం 8 నుంచి సాయం త్రం 4 గంటలవరకు పోలింగ్‌ జరుగనుంది. మార్చి17న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు
రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు కలిపి దాదాపు సగం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండడంతో ఆ ప్రాంతాలపై పట్టు సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎంఎల్‌సి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నామిషనేషన్ల దాఖలు కంటే ముందే గత రెండు మూడు నెలల నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం ఇక నామిషనేషన్ల ఘట్టం కాస్తా ముగియడంతో ఎన్నికల్లో విజయం కోసం పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. కాగా వామపక్షాలు బలపరిచిన జయసారిథిరెడ్డి ప్రచారంలో ముందంజలో ఉన్నట్లు కనబడుతుంది. ఆయన గత మూడు నెలల నుంచి మూడు జిల్లాలలోని వివిధ ప్రాంతాలను పర్యటిస్తూ నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. తెలంగాణ ప్రజల పక్షాన ప్రజా గొంతుకకై ప్రశ్నించేందుకు తనకు ఒక అవకాశం ఇచ్చి శాసనమండలికి పంపిస్తే నిద్రపోయిన మొద్దు ప్రభుత్వాన్ని మేల్కోలుపుతానని ఆయన నిరుద్యోగులకు హామీ ఇస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?