ఐఐటి స్నాతకోత్సవంలో మోడీ
చెన్నై: అమెరికాలో తాను గత వారం చేసిన పర్యటన సందర్భంగా పాల్గొన్న ఉన్నత స్థాయి సమావేశాల్లో నవభారత నిర్మాణంకు సంబంధించిన ఆశాభావమే సామాన్య అంశం అయిందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సముదాయం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తనదైన ముద్రవేసిందని కూడా చెప్పా రు. మద్రాస్‌లోని ఐఐటి 56వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాలు చెప్పారు. ‘ప్రత్యేక అవకాశాల కోసం ప్రపంచ దేశాలు భారత్ వై పు చూస్తున్న తరుణంలో మద్రాస్ ఐఐటి విద్యార్థు లు పట్టాలు పుచుకుని వెళుతున్నారు’ అని ఆయ న పేర్కొన్నారు. ‘నేను ఇటీవలే అమెరికా నుంచి తిరిగొచ్చాను. ఈ పర్యటనలో నేను అనేక మంది దేశాధినేతలు, వ్యాపారవేత్తలు, అన్వేషకులు, పె ట్టుబడిదారులతో భేటీ అయ్యాను. మా చర్చల్లో నవభారత నిర్మాణ ఆశాభావమే సమాన్య అంశం గా మారింది. భారత్‌లోని యువత సామర్థ్యంపై విశ్వాసం కనిపించింది’ అని మోడీ చెప్పారు. ‘మీ ఐఐటి సీనియర్లు ప్రపంచవ్యాప్తంగా భారత్ బ్రాం డ్‌ను సృష్టిస్తున్నారు. ఇటీవల నేను యుపిఎస్సి పరీక్షలు ఉత్తీర్ణులైన యువ అధికారులతో మాటామంతి జరిపాను. అయితే వారిలో ఐఐటి గ్రాడ్యుయేట్ల సంఖ్య మీకు, నాకు ఆశ్చర్యం కలిగించే రీతి లో ఉంది. ఈ విధంగా మీరు భారత్‌ను మరింత అభివృద్ధి స్థానానికి తీసుకెళుతున్నారు’ అని చెప్పుకొచ్చారు. కార్పొరేట్ ప్రపంచంలో ఉన్న చాలా మంది ఐఐటి నుంచి వచ్చినవారేనన్నారు. ఐఐటి నుంచి పట్టాపుచ్చుకుని వెళుతున్న విద్యార్థులు తమకున్న అవకాశాలను ఉపయోగించుకోవాలని ప్రధాని మోడీ చెప్పారు. ‘మిమ్మల్ని నేను ఒకటే కో రుతాను. మీరెక్కడ పనిచేసినా, ఎక్కడ జీవిస్తున్నా, మాతృభూమి అవసరాలు మనసులో పెట్టుకోండి. మీ పని, అన్వేషణ, పరిశోధన తోటి భారతీయులకు ఎలా సాయపడగలదని ఆలోచించండి’ అ న్నారు. ఇది కేవలం సామాజిక బాధ్యతే కాదు, అపారమైన బిజినెస్ సెన్స్‌తో కూడుకున్నదన్నారు.
నవభారత నిర్మాణంపై ఆశలు చిగురించాయి
RELATED ARTICLES