జనరల్ సీటు ఎస్టికి
రెండోసారి ప్రయోగం చేస్తున్న టిఆర్ఎస్
హైదరాబాద్ : త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై టిఆర్ఎస్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా కాంగ్రెస్ దిగ్గజాల నిలయమైన నల్లగొండ లోక్సభ స్థానా న్ని సొంతం చేసుకునేందుకు ప్రత్యేక వ్యూహ రచన చేస్తోంది. అందులో భాగంగా లంబాడ వర్గానికి చెందిన ఎస్టి అభ్యర్థికి ఇవ్వడంపై పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నల్లగొండ పార్లమెంటు నియోకవర్గ పరిధిలో ఎస్టి ఓటర్ల లెక్కలను టిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో సుమారు 3 లక్షల మంది వరకు ఎస్టి ఓటర్లు ఉన్నట్లు తెలిసింది. గతంలో కూడా ఒక సారి జనరల్ స్థానంలో ఎస్టి అభ్యర్థిని నిలబెట్టి కెసిఆర్ ప్రయోగం చేశారు. అప్పుడు అది విజయవంతమైంది.
నల్లగొండ లోక్సభ బరిలో ఎస్టి అభ్యర్థి?
RELATED ARTICLES