తెలంగాణలో 53కు చేరిన కరోనా మృతుల సంఖ్య
కొత్తగా 41 కేసులు నమోదు
1854కి చేరిన కొవిడ్ -19 పాజిటివ్ బాధితులు
ప్రజాపక్షం/హైదరాబాద్: కరోనా వైరస్‌తో రాష్ట్రంలో తాజాగా మరో నలుగురు మరణించారు. కొత్తగా 41 కేసులు నమోదు కాగా ఇందులో జిహెచ్‌ఎంసి పరిధిలో 23, రంగారెడ్డి జిల్లాలో ఒకరు, వలస కార్మికులు 11, మిగిలిన ఆరుగురు విదేశీయులు ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 1854 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 53కు చేరుకుంది. ఆదివారం 24 మంది డిశ్చార్జ్ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ను విడుదల చేసింది. వీరితో కలిపి ఇప్పటి మొత్తం 1092 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగానే కొనసాగుతున్నాయి. మరో 25 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కేవలం జిహెచ్‌ఎంసిలోనే కేసులు ఎక్కువగా నమోదవున్నాయి. వలస కార్మికుల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
నలుగురు మృతి
RELATED ARTICLES