HomeOpinionArticlesనకిలీ... మకిలీ

నకిలీ… మకిలీ

డిమాండ్‌ పెరుగుతుండటంతో మార్కెట్‌లోకి నకిలీ శానిటైజర్లు
పొరుగు రాష్ట్రాల నుండి తెలంగాణకు

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ విస్తరించేందుకు దోహదమవుతున్న గాలి తుంపరలను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్క రూ ఇప్పుడు ముఖానికి మాస్క్‌లతో పాటు చేతు లు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు శానిటైజర్లను వినియోగిస్తున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో డిమాండ్‌కు సరిపడా శానిటైజర్లు మార్కెట్‌లో లభించడం లేదు.  ఇప్పటికే కొనుగోలు చేసిన శానిటైజర్లు వారం పది రోజుల్లోనే అయిపోతుండడంతో మరొకటి కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే మార్కెట్‌లోకి నకిలీ శానిటైజర్లు విచ్చలవిడి గా వస్తున్నాయి. సాధారణంగా శానిటైజర్‌ అంటే కరోనా వైరస్‌కు సంబంధించిన బ్యాక్టీరీయా, ఫంగస్‌ లేదా వైరస్‌ను నాశనం చేయాల్సిన స్వభా వం ఉండాల్సి ఉంటుంది. అన్నింటికీ మించి శానిటైజర్లలో ఆల్కహాల్‌ 60 శాతానికి మించి ఉండా ల్సి ఉంటుంది. 75 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఇంకా ఉత్తమం అంటున్నారు.  ఆల్కహాల్‌ శాతం ఎంత ఎక్కువగా ఉంటే అంత మేరకు సూక్ష్మక్రిములను అది సంహరిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాణాలు అన్నీ పాటించినవే ఒరిజినల్‌ శానిటైజర్లు అని చెబుతున్నారు. మెడికల్‌షాపుల్లో కొనుగోలు చేసే సమయంలో ఏది నకిలీదో ఏది అసలైనదో తెలియని వినియోగదారులు నకిలీ శానిటైజర్లనూ  కొనుగోలు చేస్తున్నారు. అచ్చం ఒరిజినల్‌ శానిటైజర్‌ను పోలీ ఉంటున్నా.. చేతిపై వేసుకున్నాక తేడా కనిపిస్తోందని, చేతిపై పొట్టు లేసి చర్మం పొడిబారినట్లు ఉంటోందని వినియోగదారులు చెబుతున్నారు. సుగంధ పరిమళాల వాసన వెదజల్లుతుండడంతో గుర్తించడం సమస్యగా మారుతోందంటున్నారు. అవసరాల మేరకు ఉన్నాయంటున్న ప్రభుత్వం కరోనా విజృంభణతో ఒక పక్క ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సోమవా రం నాటి మీడియా సమావేశంలో అన్ని చర్యలు తీ సుకుంటున్నామని చెప్పారు. మాస్క్‌లే కాదు, శానిటైజర్లను అవసరాల మేరకు వాటి ఉత్పత్తికి ఆర్డర్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రజలకు ఉచితంగా వాటిని అందిస్తే మేలని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఆర్డర్‌ చేసిన శానిటైజర్లు వచ్చే దాకా వేచి చూద్దామా? లేదంటే ప్రస్తుత అవసరాల మేరకు మార్కెట్‌లో దొరుకుతున్న వాటినే  కొనుగోలు చేద్దామా? అన్న డైలమాలో వినియోగదారులు ఉంటున్నారు.
ఇతర రాష్ట్రాల నుండే తెలంగాణకు !
దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో గుట్టలుగా తయారు అవుతున్న నకిలీ శానిటైజర్లు గుట్టు చ ప్పుడు కాకుండా వివిధ రాష్ట్రాలకు చేర వేసి పలువు రు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వి నిపిస్తున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో పలు దుకాణాలకు ఈ నకిలీ శానిటైజర్లు పంపిణీ చేసినట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్‌ నగరంలో మూడు చోట్ల పోలీసులు దాడులు చేసి వాటిని పట్టుకున్నారు కూడా. మన రాష్ట్రంలోనే కా దు, కర్నాటక , తమిళనాడు, మహారాష్ట సహా దే శంలోని పలు ఇతర రాష్ట్రాల్లోనూ  నకిలీ శానిటైజ ర్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. వ్యాపారుల తీ రు ఎలా ఉన్నా  తప్పని పరిస్థితుల్లో వీటిని కొనుగో లు చేస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments