ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ధోనీని ఎంపిక చేసిన బిసిసిఐ
అంబటిరాయుడు, దినేశ్‌కార్తీక్‌కు చోటు
ముంబయి: టెస్టు సిరీస్ అనంతరం జరగబోయే వన్డే జట్టులో ధోనీకి స్థానం కల్పించారు. ఈ వన్డే సిరీస్, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ-20 సిరీస్‌ల కోసం టీం ఇండియా వివరాలను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఈ జట్లలో టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోనీకి.. తిరిగి చోటు కల్పించారు. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన టీ-20 సిరీస్, ఆస్ట్రేలియాతో జరిగిన టీ-20 సిరీస్‌లో ధోనీకి విశ్రాంతినిచ్చిన కమిటీకి విమర్శల వర్షం కురిసింది. ధోనీ లేకుండా విదేశీ పర్యటనకు వెళితే.. జట్టుకు పరాభవం తప్పదని అభిమానులు కామెంట్ చేశారు. కానీ వెస్టిండీస్‌తో జరిగిన టీ-20 సిరీస్‌ని 3-0 తేడాతో విజయవంతంగా చేజిక్కించుకున్న భారత్, ఆసీస్‌తో జరిగిన టీ-20 సిరీస్‌ని మాత్రం డ్రాగా ముగించుకుంది. అయితే ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌కి ముందు ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్, ఆ తర్వాత న్యూజిలా్‌ండ జరిగే వన్డే, టీ-20 సిరీస్‌లలో ధోనీని జట్టులోకి తీసు కున్నారు. అనుభవం కలిగిన ఆటగాడు జట్టులో ఉంటే.. జట్టుకు మ న్ని ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని, అందుకే ధోనీని సెల క్టర్లు జట్టులోకి తీసుకున్నారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు. కాగా, ధోనీకి తిరిగి జట్టులో చోటు దక్కడంపై అత ని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జట్ల అంచనా..
ఆసీస్, కివీస్‌తో వన్డేలకు : విరాట్ కోహ్లీ(కెప్టె న్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, శిఖర్ ధవన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జా దవ్, ఎంఎస్ ధోనీ(కీపర్), హార్థిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజవేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ.
కివీస్‌తో టీ-20 : విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ(కీపర్), హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజవేంద్ర చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్.
ధోనీ ఆగయా..
RELATED ARTICLES