న్యూ ఢిల్లీ: భారత పరుగుల రాణి ద్యుతీ చంద్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నిరాశపరిచింది. మహిళల 100 మీటర్ల రేసును 11.48 సెకన్లలో పూర్తిచేసి సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. 47 మంది పోటీదారుల్లో ఆమె 37 స్థానంలో ఆమె నిలిచింది. సెమీఫైనల్ క్వాలిఫయిర్ అర్హత 11.31 సెకన్లు. ఏప్రిల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో ద్యుతీ 11.28 సెకన్లలోనే రేసును పూర్తిచేసింది. గతంలో 11.26 సెకన్లతో జాతీయ రికార్డును అందుకున్న ద్యుతీ ప్రస్తుత ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో తేలిపోయింది.
ద్యుతీ.. నిరాశ
RELATED ARTICLES