దేశంలో 506కు చేరిన కరోనా కేసులు

ఇప్పటి వరకు 9 మంది మరణించినట్టు ఐసిఎంఆర్‌ వెల్లడి
న్యూ ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు (కోవిడ్‌-19) మంగళవారం 506కు చేరినట్టు , ఇప్పటివరకు 9 మంది మరణించినట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎంఆర్‌) తెలిపింది. కాగా, 97 కేసులతో మహారాష్ట్ర పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. ఇద్దురు మృతి చెందారని, 95 కేసులతో కేరళ రెండోస్థానంలో ఉందని ఐసిఎంఆర్‌ తెలిపింది. మంగళవారం ఉదయం నాటికి 35 మంది కోలుకున్నారని ప్రకటనలో పేర్కొంది.

DO YOU LIKE THIS ARTICLE?