HomeNewsLatest Newsదులీప్‌ ట్రోఫీ ఈ సారి సరికొత్తగా..

దులీప్‌ ట్రోఫీ ఈ సారి సరికొత్తగా..

నలుగురు మినహా ప్రధాన ఆటగాళ్లంతా బరిలో..

దేశీయ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దులీప్‌ ట్రోఫీ సెప్టెంబరు 5 నుంచి ప్రారంభం కానుంది. భారత స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆర్‌.అశ్విన్‌లకు ఈ టోర్నీ నుంచి మినహాయింపు లభించింది. శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ సహా ప్రధాన ఆటగాళ్లందరూ బరిలోకి దిగనున్నారు. గిల్‌ (టీమ్‌-ఎ), అభిమన్యు ఈశ్వరన్‌ (టీమ్‌-బి), రుతురాజ్‌ గైక్వాడ (టీమ్‌-సి), శ్రేయస్‌ అయ్యర్‌ (టీమ్‌-డి) కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
కొత్త ఫార్మాట్‌లో1961లో మొదలైన దులీప్‌ ట్రోఫీ ఇది వరకు ఆరుజట్లతో జోనల్‌ ఫార్మాట్‌లో జరిగేది. అయితే, 2024 ఎడిషన్‌ నుంచి జోనల్‌ ఫార్మాట్‌కు స్వస్తి పలకాలని బీసీసీఐ నిర్ణయించిది. ఈ సారి నాలుగు జట్లతో దులీప్‌ ట్రోఫీని నిర్వహించనుంది. జట్లకు టీమ్‌ ఎ, టీమ్‌ బి, టీమ్‌ సి, టీమ్‌ డి అని పేర్లు పెట్టింది. టోర్నమెంట్‌ను ఎలాంటి నాకౌట్‌ మ్యాచ్‌లు లేకుండా రౌ్‌ండ రాబిన్‌ ఫార్మాట్‌లో నిర్వహించనుంది. ప్రతి జట్టు మిగిలిన అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు విజేతగా నిలుస్తుంది.
ఒక్కో మ్యాచ్‌ నాలుగు రోజులపాటు జరగనుంది. సెప్టెంబరు 19 (చెన్నై), 27 (కాన్పూర్‌)న బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే రెండు టెస్టులకు దులీప్‌ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగానే జట్టును ఎంపిక చేస్తామని బీసీసీఐ ప్రకటించింది.
అనేక సార్లు మార్పులు..
ఈ ట్రోఫీలో ఫార్మాట్‌ను చాలాసార్లు మార్చారు. కొన్ని సీజన్లపాటు నాకౌట్‌ పద్ధతిలో, మరికొన్నిసార్లు లీగ్‌ ఫార్మాట్‌లో నిర్వహించారు.

దులీప్‌ ట్రోఫీ షెడ్యూల్‌
సెప్టెంబరు 5 – టీమ్‌ ఎ Vs టీమ్‌ బి (చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు)
సెప్టెంబరు 5 – టీమ్‌ సి Vs టీమ్‌ డి (రూరల్‌ డెవలప్‌మెంట్‌ స్టేడియం ’ఎ’, అనంతపురం)
సెప్టెంబరు 12 – టీమ్‌ ఎ Vs టీమ్‌ డి (రూరల్‌ డెవలప్‌మెంట్‌ స్టేడియం ’ఎ’, అనంతపురం)
సెప్టెంబరు 12 – టీమ్‌ బి Vs టీమ్‌ సి (రూరల్‌ డెవలప్‌మెంట్‌ స్టేడియం ’బి’, అనంతపురం)
సెప్టెంబరు 19 – టీమ్‌ బి Vs టీమ్‌ డి (రూరల్‌ డెవలప్‌మెంట్‌ స్టేడియం ’బి’, అనంతపురం)
సెప్టెంబరు 19 – టీమ్‌ ఎ Vs టీమ్‌ సి (రూరల్‌ డెవలప్‌మెంట్‌ స్టేడియం ’ఎ’, అనంతపురం)

2002-2003 సీజన్‌లో జోనల్‌ టీమ్‌లకు బదులు ఆయా రంజీ జట్లు తలపడ్డాయి. కానీ, ఇది ఒక సీజన్‌కే పరిమితమైంది. 2003-04 సీజన్‌ నుంచి ఐదు జోనల్‌ టీమ్‌లతోపాటు ఒక విదేశీ జట్టు దులీప్‌ ట్రోఫీలో పాల్గొనేది. 2003-04 సీజన్‌లో ఇంగ్లాండ ఎ జట్టు ఆడింది. 2009-10 సీజన్‌ నుంచి ఈ విధానాన్ని తొలగించారు. అప్పటి నుంచి 2014-15 సీజన్‌ వరకు జోనల్‌ సిస్టమ్‌ తీసుకొచ్చారు. 2015-16లో టోర్నీని నిర్వహించలేదు. 2016-17 నుంచి కొత్త ఫార్మాట్‌ను ప్రవేశపెట్టారు. ఇండియా బ్లూ, ఇండియా గ్రీన్‌, ఇండియా రె్‌డ జట్లతో పేరుతో రౌ్‌ండ రాబిన్‌ పద్ధతిలో మ్యాచ్‌లు జరిగాయి.
మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌ చేరాయి. అన్ని మ్యాచ్‌లను డే/నైట్‌, పింక్‌ బాల్‌తో నిర్వహించారు. ఈ విధానంలో మూడు సీజన్‌లు జరిగాయి. తర్వాత కరోనా మహమ్మరి కారణంగా దీనిని కూడా రద్దు చేశారు. 2022-23లో మళ్లీ జోనల్‌ టీమ్‌ పద్ధతిని తీసుకొచ్చారు. ఈ సారి నార్త్‌ఈస్ట్‌ జోన్‌ను ఆరో జోన్‌గా చేర్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments