అంగీకరించిన కేరళ ప్రభుత్వం
రెండు లక్షల మెట్రిక్ టన్నుల మేరకు బాయిల్డ్ బియ్యం కొనుగోలుకు సంసిద్ధత
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కేరళ మంత్రి జిఆర్ అనిల్‌కుమార్ భేటీ
పజాపక్షం /హైదరాబాద్ తెలంగాణ నుంచి బాయిల్డ్ బియ్యం, మిర్చిని కోనుగోలు చేయడానికి కేరళ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రెండు లక్షల మెట్రిక్ టన్నుల మేర బాయిల్డ్ బియ్యం కొనుగోలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిం ది. హైదరాబాద్‌కు వచ్చిన కేరళ ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ మంత్రి జి.ఆర్. అనిల్ కుమార్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డితో సచివాలయంలో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ విజేత, స్వర్ణ రకాల బియ్యం తీసుకోవడానికి కేరళ ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నదని వెల్లడించారు. ఈ వైరటీ ధాన్యం పండించే రైతులకు ఇది మంచి అవకాశమన్నారు. ఈ అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ వేసి చర్చించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన ఆహార వస్తువులకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు మంత్రుల మధ్య సమావేశంలో సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానంగా కేరళ రాష్ట్రానికి అవసరమైన కొన్ని వరి రకాలను తెలంగాణలో పండించడం గురించి చర్చించారు. ఉభయలకు అనుగుణమైన ధరతో కేరళ రాష్ర్టంలోని బియ్యం అవసరాలను తెలంగాణ రాష్ర్టం కచ్చితంగా తీర్చగలదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి వివిధ అవకాశాలను అన్వేషించి, ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేయాలని ఈ సమావేశానికి హాజరైన పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్.చౌహాన్‌కు మంత్రి ఆదేశించారు. కేరళ పౌర సరఫరాల శాఖ కమిషనర్ డాక్టర్ డి.ఎస్.సుజిత్ బాబు కూడా సమావేశంలో పాల్గొన్నారు. వారిరువురు ఉభయ రాష్ట్రాల అవసరాలు, ఇతర పద్ధతుల గురించి వివరంగా చర్చించారు. అలాంటి ఒప్పందం కార్య రూపం దాలిస్తే ఉభయ రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కేరళలో పండించే ఇతర ఆహార వస్తువుల అవసరాల గురించి కూడా చర్చించారు. కేరళ రాష్ర్ట అవసరాలను తీర్చేందుకు గల అవకాశాలను అన్వేషించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌరసరఫరాల శాఖను ఆదేశించారు. సమావేశం చాలా సానుకూలంగా మరియు ఆశాజనకంగా సాగినట్లు అధికారుల తెలిపారు.
తెలంగాణ బాయిల్డ్ బియ్యం, మిర్చి కొంటాం
RELATED ARTICLES