HomeNewsTelanganaతక్షణం వేతన బకాయిలు చెల్లించాలి

తక్షణం వేతన బకాయిలు చెల్లించాలి

ఎన్‌హెచ్‌ఎం డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ధర్నా
ప్రజాపక్షం/హైదరాబాద్‌ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ స్కీమ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న దాదాపు 17వేల మంది కాంట్రాక్ట్‌ ఔటోసోర్సింగ్‌ ఉద్యోగులకు మూడు నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఎఐటియుసి) రాష్ట్ర అధ్యక్షులు ఎం నరసింహ్మ డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను తీసుకొచ్చి ఉద్యోగులకు వెంటనే జీతాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌,కోఠిలోని ఎన్‌హెచ్‌ఎం
డైరెక్టర్‌ కార్యాలయం ఎదుట ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఎఐటియుసి) ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం నరసింహ్మ మాట్లాడుతూ ఫీల్డ్‌ లెవల్‌లో ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి పేరు తీసుకొస్తున్నప్పటికీ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రాక అనేక ఇబ్బందు లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిండి కి, పిల్లల ఫీజులకు డబ్బులు లేక ఉద్యోగుల కష్టా లు వర్ణనాతీతమన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు సమ్మె చేసిన సందర్భంగా పిఆర్‌సి బకాయిలు విడుదల చేస్తామని, ఇవ్వలేదని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమైనా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పిఆర్‌సి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మూడు నెలల పెండింగ్‌ జీతాల కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో డిఎం అండ్‌ హెచ్‌ ఓ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నామని, తక్షణమే జీతాలు చెల్లించకపోతే మరోసారి సమ్మె నోటీసు ఇచ్చి పూర్తిగా విధులను బహిష్కరిస్తామని, హెచ్చరించారు. రోజురోజుకూ ఉద్యోగుల పనులను పెంచుకుంటూ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ అంటూ రాత్రి పగలు అనే తేడాలు లేకుండా చేయించుకుంటూ జీతాలు ఇవ్వడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. 60 శాతం నిధులు సమకూర్చాల్సిన కేంద్ర ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఈ స్కీముకు డబ్బులు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. మోడీ ప్రభుత్వం బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రం ఎన్‌హెచ్‌ఎం నిధులు అధిక శాతం కేటాయించి, కేవలం నాలుగు రాష్ట్రాలకు 42 శాతం నిధులు కేటాయించి, తెలంగాణ రాష్ట్రానికి గత ఆరు నెలలుగా నిధులను కూడా విడుదల చేయడం లేదని దుయ్యబట్టారు. కాగా కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 1000 కోట్ల నిధులు ఎన్‌హెచ్‌ఎం స్కీమ్‌కు రావాల్సి ఉన్నదని, కేంద్రం నుండి బకాయలు వచ్చిన వెంటనే ఉద్యోగుల జీతాలు చెల్లిస్తామని ఎన్‌హెచ్‌ఎం డైరక్టర్‌ స్పష్టం చేసినట్టు నరసింహ తెలిపారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడామని, తొందరలోనే కార్మికులకు జీతాలు అందేలా తగు చర్యలు తీసుకుంటామని తమకు హామీనిచ్చినట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి రంగారెడ్డి జిల్లా నాయకులు రామస్వామి జైపాల్‌ రెడ్డి సెకండ్‌ ఏఎన్‌ఎం యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి జి పద్మ, ఎన్‌ హెచ్‌ ఎం యూనియన్‌ నాయకులు బాలసుబ్రహ్మణ్యం, రెండవ ఏఎన్‌ఎంల నాయకురాలు సువర్ణ, జయమ్మ, సుజాత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments