మంటలు ఆర్పుతుండగా కూలిన భవనం
ఒకరి మృతి, మరో 14 మందికి గాయాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలోని ఒక కర్మాగారంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసు కుంది. సహాయక చర్యలు కొనసాగుతూ ఉండగానే పెద్ద పేలుడు సంభవించింది. దీంతో ఆ కర్మాగార భవనం కూలిపోయింది. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది ఒకరు మృతిచెందగా, మరో 14 మంది గాయడ్డారని అధికారులు తెలిపారు. ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశా రు. ‘బాధాకర విషయం. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్య వేక్షిస్తున్నా ను. అగ్ని మాపక సిబ్బంది తమ వంతు కృషి చేస్తున్నా రు. ఈ ప్రమా దంలో 13 మంది అగ్నిమాపక సిబ్బంది గాయ పడ్డార’ని ఆయన ట్వీట్ చేశారు. అనంతరం మరో ట్వీట్‌లో ఒక వ్యక్తి మరణిం చారని ధృవీకరించారు. హోం మంత్రి సత్యేందర్ జైన్, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు మనోజ్ తివారీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సంఘటనా స్థలంలో సహాయ క చర్యలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీలో అగ్నిప్రమాదం
RELATED ARTICLES