28న పోలింగ్..
అదే రోజు ఫలితాలు
ప్రజాపక్షం/హైదరాబాద్: జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(డిసిసిబి) మేనేజ్మెంట్ కమిటి ఎన్నికలకు స్టేట్ కో సొసైటి ఎలక్షన్ అథారిటీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 22న ఎన్నికల అధికారి నోటీసు జారీ చేస్తారు. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయం త్రం 5గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిచ్చారు. ఈనెల 28న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపడతారు. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు. ఈ నెల 29న ఆఫీస్ బేరర్స్ను ఎన్నుకుంటారు. ఖమ్మం డిసిసిబికి మాత్రం 20మంది ఎంసి సభ్యులను ఎన్నుకుంటారు. వీరిలో 16 మంది సభ్యులను పిఎసిఎస్/ఎఫ్ఎస్సిఎస్/ఎల్ఎస్సిఎస్లకు రిజర్వ్ చేశారు. వీరిలో ఎస్సి క్యాటగిరికి మూడు, ఎస్టికి ఒకటి, బిసికి రెండు, జనరల్ క్యాటగిరికి 10మందిని రిజర్వ్ చేశారు. మరో నలుగురుని ఇసిసిఎస్, సిహెచ్ఎస్, పిడబ్ల్యూసిఎస్, ఎఫ్సిఎస్లకు రిజర్వ్ చేయగా వీటిని ఎస్సి, ఎస్టి, బిసి, జనరల్ క్యాటగిరీలకు ఒక్కొక్కటి రిజర్వ్ చేశారు. ఎస్సి క్యాటగిరికి పింక్ కలర్, ఎస్టికి లైట్ బ్లూ, బిసికి లైట్ గ్రీన్, జనరల్ క్యాటగిరికి వైట్ కలర్ బ్యాలట్ పేపర్లను వినియోగిస్తారు.
డిసిసిబి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
RELATED ARTICLES