న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ప్ర పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా కీలక బాధ్యత లు స్వీకరించనున్నా రు. 194 దేశాల డబ్ల్యుహెచ్‌ఒ మంగళవారంనాడు సమావేశమైంది. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ ఎంపికైంది. ఇప్పటి వరకూ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా ఉన్న జపాన్‌కు చెందిన డాక్టర్ హిరోకి నకటాని స్థానంలో హర్షవర్దన్ వెళ్లనున్నారు. హర్షవర్దన్ నియమాకాన్ని సభ్యదేశాలు కూడా అంగీకరించాయి. దీంతో ఈనెల 22న జరగనున్న బోర్డు మీటింగ్‌లో హర్షవర్ధన్ బాధ్యతలు చేపడతారు. కాగా, ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ అనేది పూర్తికాలం అసైన్‌మెంట్ కాదని, కేవలం బోర్డు సమావేశంలో మాత్రమే చైర్మన్ అందుబాటులో ఉండాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. బోర్డు సమావేశాలు సహజంగా ఏడాదిలో రెండుసార్లు జనవరి, మేలో జరుగుతుంటాయి. మూడేళ్ల సభ్యత్వం కోసం బోర్డు సభ్యులను ఎంపిక చేస్తారు. ఇటీవల 73 డబ్ల్యుహెచ్‌ఒ సమావేశాల్లోనూ వీడియా కాన్ఫరెన్స్ ద్వారా హర్షవర్దన్ మాట్లాడారు. ప్రధానంగా కొవిడ్ మహమ్మారిపై పోరాటానికి భారత్ తీసుకుంటున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోరనా వైరస్ పుట్టకకు సంబంధించి సంతంత్ర విచారణకు 100కు పైగా దేశాలు సమ్మతి తెలిపిన నేపథ్యంలో 34 మంది సభ్యుల డబ్ల్యుహెచ్‌ఒ ఎగ్జిక్యూటివ్ బోర్డుకు చైర్మన్‌గా డాక్టర్ హర్షవర్దన్ ఎంపిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
డబ్ల్ల్యుహెచ్‌ఒ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా హర్షవర్దన్
RELATED ARTICLES