అంబాలా: హర్యానాలోని అంబాలా పట్టణంలో ట్రక్కు స్కూటర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతిచెందినట్లు, ఒకరికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఆ యువకులు అంబాల పట్టణంలో మతపరమైన సభలో పాల్గొని అంబాలా కంటోన్మెంట్‌కు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. అంబాలా పాలిటెక్నిక్ చౌక్ వద్ద మలుపు తిరుగుతుండగా స్కూటర్ ట్రక్కును ఢీకొందని, ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారని, మరొకరికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. మృతిచెందిన వారిని వికాస్ (15), శుభమ్ (16), ధీరజ్ (20)లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తి శివమ్(16)ను ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ పారిపోయాడని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ట్రక్కును ఢీకొన్న స్కూటర్ : ముగ్గురు మృతి
RELATED ARTICLES