ట్రంప్‌ అభిశంసన ఖాయం?

అనుకూలంగా 223, ప్రతికూలంగా 205 ఓట్లు
వాషింగ్టన్‌: ఇప్పటికే అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన పోరులో పరాజయాన్ని ఎదుర్కొన్న డొనాల్డ్‌ ట్రంప్‌ అత్యంత అవమానకరమైన రీతి లో వైట్‌ హౌస్‌ను వీడటం ఖాయంగా కనిపిస్తున్నది. ఆయనపై యుఎస్‌ కాంగ్రెస్‌ (పార్లమెం టు) దిగువ సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌) లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 223 ఓట్లు రాగా, ప్రతికూలంగా 205 మంది ఓటు వేశారు. ట్రంప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీకే చెందిన ఒక సభ్యు డు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. ఐదుగురు సభ్యులు ఓటింగ్‌కు హాజరుకాలేదు. మొత్తం మీద క్యాపిటోల్‌పై దాడి సంఘటన ట్రంప్‌ ప్రతిష్ఠను పాతాళానికి నెట్టేసింది. డెమోక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న ట్రంప్‌ ఈ వారం చివరిలో పదవి నుంచి వైదొలగాల్సి ఉం టుంది. అయితే, క్యాపిటోల్‌ సంఘటనను డెమోక్రాట్లు పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకొని, అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత విషాధ సంఘటనగా అభివర్ణించారు. మద్దతుదారులను రెచ్చగొట్టి, దాడి చేయించకమేగాక, దానిని సమర్థించిన ట్రంప్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ పదవిలో ఉండడానికి వీల్లేదని పట్టుబట్టారు. అమెరికా రాజ్యాంగం 25వ సవరణ ప్రకారం ట్రంప్‌ను తొలగించాల్సిందేనని డిమాండ్‌ చేసినప్పటికీ, రిపబ్లికన్‌ పార్టీకే చెందిన వాడుకావడంతో ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సానుకూలంగా స్పందించలేదు. దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీకి రాసిన లేఖలో, 25వ సవరణ అనేది ఒకరిని శిక్షించడానికిగానీ, దోపిడీకి విరుద్ధంగా గానీ వినియోగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్‌ను ఆ విధంగా సాగనంపితే, భవిష్యత్తులో ఈ సవరణ అవాంఛనీయ పరిణామాలకు, అనైతిక సంప్రదాయాలకు కారణమవుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డెమోక్రాట్లు నేరుగా దిగువ సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి ఆమోద ముద్ర పడడంతో బంతి ఇప్పుడు తిరిగి పెన్స్‌ కోర్టుకు చేరింది. 25వ సవరణను అమలు చేసే విషయంపై ఆయనదే తుది నిర్ణయం అవుతుంది. ఒకవేల పెన్స్‌ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే దిగువ సభ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి రేపుతున్నది.

DO YOU LIKE THIS ARTICLE?