aకాషిఫ్ కాక్వి
భోపాల్: మాలేగాం బాంబు పేలుడు కేసులో నిందితురాలు సాధ్వి ప్రగ్యాఠాకూర్ను భోపాల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థిగా బుధవా రం నాడు ప్రకటిస్తూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమం త్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమె పుట్టింది ఈ దేశ భద్రతను పరిరక్షించేందుకు అని అభివర్ణించారు. ఇతర బిజెపి నాయకులు ఠాకూర్‌ను హిందువులను అపఖ్యాతి పాలు చేసే కాంగ్రెస్ కుట్రకు బలైపోయిన వ్యక్తిగా అభివర్ణించారు. మహారాష్ట్ర వార్ధాలో ఎన్నికల ప్రచార సందర్భం గా ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీనికి హిందువులు, కాంగ్రెస్‌ను ఎన్నటికీ క్షమించలేరని, ఆ పార్టీ ‘హిందూ ఉగ్రవాద’ అవమానాన్ని శిక్షించి తీరుతారని అన్నారు. ఇక్కడ చిత్రమేమిటంటే, సాధ్వీని ఆమె విమర్శకులు హిందూత్వ తీవ్రవాద మార్గదర్శకురాలిగా చూస్తే బిజెపి మాత్రం అవమానాల పాలైన హిందూ ప్రతినిధిగా ఆమె ను ప్రదర్శిస్తున్నది. అయితే చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమెపై మొట్టమొదటిసారి ఉగ్రవాద సంబంధిత కేసులో నిందితురాలిగా బిజెపి రాష్ట్ర ప్రభుత్వం నేరారోపణ చేయటం గుర్తుచేసుకోదగింది. అప్పుడు ముఖ్యమంత్రి చౌహాన్. 2008 సెప్టెంబర్ 23 న, సాధ్వీ ఠాకూర్‌ను మరో ఎనిమిదిమందిని ఆర్ఎస్ఎస్ మనిషి సునీల్ జోషీని మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలో హత్య చేసిన సంఘటనతో ప్రమేయం ఉందనే ఆరోపణపై చౌహాన్ సొంత పోలీసులు అరెస్ట్ చేశా రు. “ఆమె అభ్యర్థిత్వా న్ని ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి ఈ వ్యక్తి మాలెగాం పేలుడులో నిందితురాలని, ఆమె బె యిల్‌పై ఉందనే విషయం మరచిపోయి ఉంటారు. అలాంటప్పుడు ఆమె దేశాన్ని ఎలా రక్షించగలుగుతుంది?” అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది ప్రశ్నిస్తున్నారు. 2008, 2011లో సునీల్ జోషీ హత్యతో ప్రమేయం ఉందనే ఆరోపణపై ఆమెను రెండుసార్లు తన సొంత పోలీసులు అరెస్టు చేసిన విషయం చౌహా న్ మాత్రం మరచిపోవడానికి వీల్లేదని ఆయన అన్నారు. భోపాల్ నియోజకవర్గం నుండి కాం గ్రెస్ ప్రముఖుడు దిగ్విజయ్ సింగ్‌కు వ్యతిరేకం గా సాధ్వీ ఠాకూర్‌ను నిలబెట్టారు.
టెర్రర్ కేసు పెట్టిన చేతితోనే ప్రగ్యాసింగ్‌కు బిజెపి టిక్కెట్
RELATED ARTICLES