భుజం నొప్పితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
అభిమానులందరికీ ధన్యవాదాలంటూ కన్నీటి ట్వీట్
ముంబయి: అంతర్జాతీయ టెన్నిస్ తార మరియా షరపోవా నిర్ణయం అందరిని నిరాశకు గురిచేసింది. అనిర్వచనీయ ఆనందాలను, కనిపించని కన్నీటిని కలిగించిన ఆటకు వీడ్కోలు పలుకుతున్నానని ప్రకటించింది. ఇకపై కోర్టులో అడుగుపెట్టడం లేదని వానిటీఫెయిర్ వెబ్‌సైట్‌కు తెలిపింది. ఒకప్పుడు ప్రపంచ నంబర్‌వన్‌గా తళుకులీనిన షరపోవా 373వ ర్యాంకుతో కెరీర్‌ను ముగించడం గమనార్హం. తీవ్రమైన భుజం నొప్పి, సమస్యలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ’తెలిసిన ఒకేఒక్క జీవితాన్ని వదిలేయడం ఎలా? చిన్నప్పటి నుంచీ శిక్షణ పొందిన కోర్టులను విడిచి వెళ్లడం ఎలా? కనిపించని కన్నీళ్లు, అనిర్వచనీయ ఆనందాలను అందించి, ప్రేమించిన ఆటను మానేయడం ఎలా? 28 ఏళ్లుగా ఒక కొత్త కుటుంబాన్ని, నా వెనక నిలిచిన అభిమానులను అందించిన ఆటను వదిలేయడం ఎలా? నేనిందుకు చాలా కొత్త, అందుకే నన్ను క్షమించు. టెన్నిస్- నీకు వీడ్కోలు చెప్పేస్తున్నాను. 28 ఏళ్లు, ఐదు గ్రాండ్‌స్లామ్‌ల తర్వాత, మరో శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యాను. కానీ ఇది చాలా భిన్నమైంది’ అని షరపోవా భావోద్వేగం చెందింది.
ఆటతోనే కాకుండా అందంతోనూ అభిమానులను సొంతం చేసుకున్న షరపోవా కెరీర్‌ను 15 నెలల నిషేధం కుంగదీసింది. వైద్యం కోసం నిషేధిత ఉత్ప్రేరకం ’మెల్డోనిన్’ ఉన్న ఔషధాన్ని తెలియక తీసుకున్నానని ఆమె చెప్పింది. కేవలం నాలుగు వారాలు నిషేధించిన మెల్డోనియం పేరుతో తనను ఉచ్చులో పడేశారని ఆరోపించింది. తాను కేసు గెలవకపోయి ఉంటే నాలుగేళ్లు నిషేధం విధించేవారని వెల్లడించింది. 2006-12 మధ్య ఈ టెన్నిస్ తార నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచింది. 2014లో వింబుల్డన్ కైవసం చేసుకుంది. పునరాగమనం తర్వాత ఆమె తన మునుపటి సత్తా చాటలేదు.
టెన్నిస్‌కు షరపోవా గుడ్‌బై
RELATED ARTICLES