శతకంతో ఆదుకున్న పుజారా
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు
ఆడిలైడ్: ఎన్నో ఆశలతో ఆసీస్‌గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ఈ సారి అద్భుత విజయాలు సాధించి కొత్త చరిత్ర సృష్టిస్తుందని అందరూ భావించారు. కానీ, ప్రతిసారిలాగే ఈసారి కూడా భారత బ్యాట్స్మన్లు తమ పేవలమైన బ్యాటింగ్‌తో నిరాశపరిచారు. గురువారం ఆస్ట్రేలియాతో ప్రారంభమైన మొదటి టెస్టులో భారత బ్యాట్స్మన్లు మరోసారి ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు పేవలమైన రికార్డులున్నాయి. అయితే ప్రతి సారి లాగే ఈ సారి కూడా అదే తడబాటును పుణారావృతం చేశారు. వేగంగా ఆడే ప్రయత్నంలో వరుసగా వికెట్లు కోల్పోయి భారత్‌కు నిరాశకరమైన ఆరంభాన్నిచ్చారు. భారత స్టార్ బ్యాట్స్మన్లు విరాట్ కోహ్లీ (3), మురళీ విజయ్ (11), రహానే (13), కెఎల్. రాహుల్ (3) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో భారత జట్టు కేవలం 41 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మిస్టర్ డిపేండబుల పుజారా అసాధరణ బ్యాటింగ్‌తో టీమిండియాను ఆదుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు అతను నిలకడగా రాణిస్తూ టీమిండియాను గౌరవప్రధమైన స్కోరుకు చేర్చాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఒంటరి పోరాటం చేసిన పుజారా (123) సెంచరీతో భారత్ పరువును కాపాడాడు. మిడిల్ ఆర్డర్లో రోహిత్ శర్మ (37), రిషభ్ పంత్ (25) పర్వాలేదనిపించినా భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. చివర్లో అశ్విన్ (25) కీలకమైన బ్యాటింగ్‌తో పుజారాకు అండగా నిలిచాడు. దీంతో భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి (87.5 ఓవర్ల)లో 9 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. మహ్మద్ షమీ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
టీమిండియా 250/9
RELATED ARTICLES