HomeNewsBreaking Newsటీనేజర్‌ అల్కరజ్‌కు యుఎస్‌ టైటిల్‌

టీనేజర్‌ అల్కరజ్‌కు యుఎస్‌ టైటిల్‌

న్యూయార్క్‌ : యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ శ్లామ్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో నార్వే ఆటగాడు కాస్పెర్‌ రూడ్‌ను 6-4, 2-6, 7-6, 6-3 తేడాతో ఓడించిన స్పెయిన్‌ టీనేజ్‌ సంచలనం కార్లొస్‌ అల్కరజ్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అంతేగాక, ఈ విజయంతో ప్రపంచ నంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించి, కొత్త చరిత్ర సృష్టించాడు. 20 ఏళ్ల వయసులో ప్రపంచ నంబర్‌ వన్‌గా లేటన్‌ హెవిట్‌ 2001లో సృష్టించిన రికార్డును 19 ఏళ్ల అల్కరజ్‌ బద్దలు చేశాడు. అతని కంటే ఒక ఏడాది తక్కువ వయసులోనే ప్రపంచ నంబర్‌ వన్‌ స్థానాన్ని అందుకున్నాడు.యుఎస్‌ ఓపెన్‌లో నాలుగో ర్యాం క్‌ ఆటగాడిగా అడుగుపెట్టిన అల్కరాజ్‌ పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌ లో సెబాస్టియన్‌ బయెజ్‌పై మొదటి రెండు సెట్ల ను 7 7 తేడాతో గెల్చుకొని, రెండో రౌండ్‌ లో 20 ఆధిక్యాన్ని సంపాదించాడు. ఆ దశలో బయెజ్‌ గాయం కారణంగా మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు. దీనితో రెండో రౌండ్‌కు చేరిన అల్కరజ్‌ ఆ మ్యాచ్‌ని ఫెడెరియో కొరియాపై 6 6 7 ఆధిక్యంతో సొంతం చేసుకున్నాడు. మూడో రౌండ్‌లో జెన్సన్‌ టైలర్‌ అబూక్స్‌బైపై 6 6 6 నాలుగో రౌండ్‌లో మార్టిన్‌ సిలిక్‌పై 6 3 6 4 6 ఆధిక్యంతో విజయాలు నమోదు చేశా డు. అదే దూకుడును కొనసాగిస్తూ, క్వార్టర్‌ ఫైనల్‌ లో జానిక్‌ సిన్నాను 6 6 7 6 స్కోరుతో ఓడించాడు. సెమీ ఫైనల్‌ను ఫ్రాన్సెస్‌ టియాఫోపై 6 6 6 6 తేడాతో సొంతం చేసుకున్నాడు. ఫైనల్‌లోనూ అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. కెరీర్‌లో తొలి గ్రాండ్‌ శ్లామ్‌ టైటిల్‌ను అందుకున్నాడు. ఈ ఏడాదే గ్రాండ్‌ శ్లామ్‌ ప్రస్థానాన్ని ప్రారంభించిన అతను ఆస్ట్రేలియా ఓపెన్‌లో మూడో రౌండ్‌ చేరాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో నిష్క్రమించాడు. వింబుల్డన్‌లో అతని పోరాటం నాలుగో రౌండ్‌తో ముగిసింది. ఇక ఈ ఏడాది గ్రాండ్‌ శ్లామ్స్‌లో చివరిదైన యుఎస్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచి సత్తా చాటుకున్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments