మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఈ జట్టు 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. ఈ మెగా టోర్నీలో రెండు పర్యాయాలు టైటిల్ సాధించిన రెండో జట్టుగా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. ఇంతకు ముందు 2010లో ఆస్ట్రేలియాపై గెలిచి ట్రోఫీని అందుకున్న ఇంగ్లాండ్ పుష్కర కాలం తర్వాత మరోసారి విజేతగా నిలిచింది. అంతకు ముందు వెస్టిండీస్ మాత్రమే ఈ విధంగారెండు సార్లు (2012, 2016) టి20 ప్రపంచ కప్‌ను అందుకుంది. భారత్ (2007), పాకిస్తాన్ (2009), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2021) ఒక్కోసారి చొప్పున ఈ ట్రోఫీని కైవసం చేసుకున్నాయి.
టి20 ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న ఇంగ్లాండ్ జట్టు
RELATED ARTICLES