హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నుంచి శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో పాటు టిపిసిసి వైస్ ప్రెసిడెంట్లుగా బిఎం వినోద్ కుమార్, జాఫర్ జావెద్‌ను నియమిస్తూ ప్రకటనలో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్ రెండు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 2009లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరదాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014లో రాజస్థాన్‌లోని టోంక్-సవాయ్ మాధోపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి తెలంగాణ నుంచే పోటీ చేయాలని కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం అజారుద్దీన్‌ను కోరింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అజారుద్దీన్ బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
నియమితులైన వారు వీరే…
ప్రధాన కార్యదర్శులు
* ఎస్.జగదీశ్వరరావు
* నగేశ్ ముదిరాజ్
* నర్సారెడ్డి
* మన్వంతరాయ్
* ఫాహీమ్
* కైలాష్
* లక్ష్మణ్ రెడ్డి
* కృష్ణన్
కార్యదర్శులు
* దుర్గం భాస్కర్
* దరువు ఎల్లన్న
* విజయ్ కుమార్
* బాల లక్ష్మి