కర్నూల్ : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడిని కొందరు దుండగులు అతి దారుణంగా నరికి చంపారు. హత్యకు గురైన టిడిపి నేత పేరు సోమేశ్వర్ గౌడ్ (45). రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి అనుచరుడైన సోమేశ్వర్ గౌడ్ ను గత అర్థరాత్రి దాటిన తర్వాత పల్లెదొడ్డి, కె.వెంకటాపురం గ్రామాల మధ్య వైన్‌షాప్ మూసేసి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు అతనిపై దాడిచేసి కత్తులు, వేటకొడవళ్లతో నరికి చంపేశారు. సోమేశ్వర్‌గౌడ్ బైక్‌పై వస్తుండగా, ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఒక వ్యానులో అతన్ని వెంబడించి, ఆ తర్వాత అడ్డగించి, చంపేసి పరారయ్యారు. సోమేశ్వర్ ప్రత్యర్థులే ఈ ఘటనకు బాధ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గౌడ్ కె.వెంకటాపురం గ్రామ నివాసి. అతను దేవనకొండ టిడిపి మండల శాఖ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.