కాంగ్రెస్ జాతీయ నాయకుడు గులాంనబీ ఆజాద్
నల్లగొండ : ఢిల్లీలో ముఖం చెల్లని కెసిఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యంకాలేదని, కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారం తో దశాబ్దాల ప్రజాకాంక్ష కార్యరూపం దాల్చిందని కాంగ్రెస్ జాతీయ నాయకుడు, జమ్మూకాశ్మీరు మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ అన్నా రు. ప్రజాఫ్రంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గె లుపును కాంక్షిస్తూ కోదండ రామ్‌తో కలిసి ఆదివారం నల్లగొండలో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ నేత చెన్నారెడ్డి నేతృత్వంలో 1969లోనే తెలంగాణ వాణి జాతీయ స్థాయికి చేరిందని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు సంవత్సరం పాటు రెండు సభలు కొనసాగకుండా పోరాటం సాగించారని గుర్తుచేశారు. కెసిఆర్ ప్రజలకు సా గు, తాగునీరు ఇవ్వకుండా ఢిల్లీలో మోడి, హైదరాబాద్‌లో కెసిఆర్ పగలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ రాత్రిపూట కలిసిపోతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నిక సమయాలలో కెసిఆర్ ఎన్డీయేతో సాగించిన చెలిమి ఇందుకు నిదర్శమన్నా రు.
టిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎంలు సందకాడి సోదరులు
RELATED ARTICLES