ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ప్రజాపక్షం/హైదరాబాద్ ; సినీనటి శ్రీరెడ్డి పోరాటం ఫలించింది. ఆమె చేసిన ఆరోపణలపై ఎట్టకేలకు తెలంగాణ ప్రభు త్వం స్పందించింది. ఈ మేరకు టాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై ప్యానల్ ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వు లు జారీ చేసింది. టాలీవుడ్‌లో లైం గిక వేధింపులు పెరిగిపోయాయని, వీటిని ప్రశ్నించే నాథుడే లేడని కొన్నాళ్ల క్రితం శ్రీరెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. శ్రీరెడ్డికి మద్దతుగా అప్పట్లో మహిళా సంఘాలు వేసిన పిటిషన్‌ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. వారి డిమాండ్ మేరకు ప్యానల్ ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపింది. జిఒ నంబర్ 984 ప్రకారం సినీ నటి సుప్రియ, సినీ నటి, యాంకర్ ఝూన్సీ, దర్శకురాలు నందినిరెడ్డిలను తెలంగాణ ప్రభు త్వం ఈ కమిటీలో టాలీవుడ్ ప్రతినిధులుగా నియమించింది. నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలలతో ఈ కమిటీ ఏర్పాటైంది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్‌మోహన్‌రావు, నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శక నిర్మాత సుధాకర్‌రెడ్డి కూడా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రాంమోహన్‌రావు ఈ కమిటికి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు తమను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు నిర్భయంగా చెప్పవచ్చని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ తెలిపింది.