HomeNewsBreaking Newsజోరు కొనసాగించాలి..

జోరు కొనసాగించాలి..

ఆడిలైడ్‌: దాదాపు 11 ఏళ్ల తర్వాత భారత జట్టు ఆసీస్‌ గడ్డపై విజయాన్ని నమోదు చేసిన కోహ్లీ సేన అదే జోరును తర్వాతి టెస్టుల్లో కూడా కొనసాగించాలి. నాలుగు టెస్టుల సిరీస్‌లో భా గంగా ఆడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండి యా బోణీ కొట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విజయంపై యావత్‌ భారత్‌ సంబరాలు చేసుకుంది. మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా ఈ గొప్ప విజయాన్ని పూర్తి గా అస్వాదించారు. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బౌలర్లు అంచనాలకు తగ్గట్టు రాణించి టీమిండియాకు అద్భుతమైన విజయా న్ని అందించారు. ఇక, బ్యాటింగ్‌ విషయానికి వస్తే భారత బ్యాట్స్‌మెన్స్‌ మరోసారి నిరాశ పరిచారు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం.. అదే తడబాటును పునారావృతం చేయ డం వంటివి భారత బ్యాట్స్‌మన్లకు షరమామూలైపోయింది. చతేశ్వర్‌ పుజారా ఒక్కడే ఒంటరి పోరాటం చేసి బ్యాటింగ్‌లో హీరో అయ్యాడు. అతను తొలి ఇన్నింగ్స్‌లో చేసిన సెంచరే మ్యాచ్‌లో హైలెట్‌. పుజారా సెంచరీ సాధించకపోతే భారత జట్టు ఫలితాలు వేరేవిధంగా ఉండేవని విశ్లేషకులు చెబుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో పుజారాతో పాటు అజింక్యా రహా నే కూడా గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ రాణించడంతో భారత జట్టు ఆసీస్‌ ముందు పోరాడగలిగే లక్ష్యాన్ని ఉంచగలిగింది. తర్వాత బౌలర్లు ఆసీస్‌ బ్యాట్స్‌మన్లను కళ్లెం వేసి 31 పరుగులతో భారత్‌కు రికార్డు విజయాన్ని అందించగలిగారు. తొలి ఇన్నింగ్స్‌లో తడబడినా వారు రెండో ఇన్నింగ్స్‌లో పుం జుకోవడం కలిసొచ్చింది. ఓవరాల్‌గా టీమిండియాకు టెస్టు సిరీస్‌లో శుభారంభం లభించింది. ఈ విజయం రెండో టెస్టు లో కోహ్లీసేన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపుచేస్తోంది అనడంలో సందేహంలేదు.
ఒకేఒక్కడు..
తొలి టెస్టులో భారత్‌ విజయం సాధించడంలో కీలకపాత్ర పో షించిన అసలైన హీరో పుజారానే.. ఒకవైపు సహచర ఆటగా ళ్లు ఘోరంగా విఫలమైనా.. తాను మాత్రం ధైర్యంగా ఆడుతూ పిచ్‌పై పాతుకుపోయాడు. క్లిష్ట సమయాల్లో భారత్‌కు అండగా నిలిచి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన పుజారా రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. తన గొప్ప ఇన్నింగ్స్‌తో తొలి టెస్టులో భారత్‌ను 31 పరుగులతో గెలిపించిన పుజారా మ్యా న్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో మొదట బ్యాటింగ్‌ చేపట్టిన కోహ్లీ సేనకు ఆసీస్‌ బౌలర్లు నిప్పులు చెరిగే
బంతులతో భారత బ్యా ట్స్‌మెన్స్‌ను హడలెత్తించారు. వీరి ధాటికి విరాట్‌ కోహ్లీ (3), రహానే (13), మురళీ విజయ్‌ (11), కెఎల్‌. రాహుల్‌ (2) తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరారు. దీంతో భారత జట్టు (41) పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి కష్టా ల్లో పడింది. ఈ సమయంలో రోహిత్‌ శర్మ అండతో చతేశ్వర్‌ పుజారా భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత ‘గ్రేట్‌వాల్‌’గా పేరు సంపాదించుకున్న పుజారా అసలు తానేంటో.. తన సత్తా ఎంటో ఈ మ్యాచ్‌తో ప్రపంచానికి చూపెట్టాడు. తనలో ఉన్న కసిని బ్యాట్‌పై చూపెడుతూ పరుగులను సాధించాడు. కీలక బ్యాట్స్‌మన్లు ఆవుటై పెవిలియన్‌ చేరినా.. తడబడకుండా తనదైన శైలిలో ధైర్యంగా ఆడుతూ తిరిగి పోటీలో నెలబెట్టాడు. మరోవైపు ఇతనికి అండగా నిలిచిన మరో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ వేగంగా ఆడే క్రమంలో (37) పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో భారత్‌ 86 పరుగులకే సగం బ్యాట్స్‌మన్లు పెవిలియన్‌ చేరారు. తర్వాత యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పంత్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అనుభవం పెద్దగాలేదు. అందుకే మొత్తం బాధ్యతలను తనపైనే వేసుకుని ముందుకు సాగాడు పుజారా. ఈ సమయంలో భారత జట్టుకు తన అవసరం మరింతగా ఉందని భావించిన పుజారా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. తర్వాత పంత్‌ కూడా 25 పరుగులు చేసి ఔటయ్యాడు. 127 పరుగులకే ఆరుగురు బ్యాట్స్‌మన్లు వెనుదిరిగారు. ఇప్పుడు మిగిలింది కేవలం బౌలర్లే. మరోవైపు ఆసీస్‌ బౌలర్లు వరుసదాడులు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఈసమయంలో బౌలర్లకు పరుగులు సాధించడం చాలా కష్టం. కానీ, అశ్విన్‌ (25)తో కలిసి మరో కీలక భాగసామ్యాన్ని నెలకొలిపి భారత్‌ స్కోరుబోర్డును మరింతగా మెరుగుపరిచాడు. ఈక్రమంలోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఆసీస్‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ పరుగులు సాధించాడు. ఎవ్వరు ఊహించని విధంగా పుజారా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టును 250 పరుగుల పటిష్ట స్థితికి చేర్చాడు. చివరికి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన పుజారా 246 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 123 పరుగులు చేసి తొమ్మిదోవికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఓపెనర్లు శుభారంబామే అందించారు. తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన అనంతరం మురళి విజయ్‌ ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా మరోసారి గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. మరో ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ (44) పరుగులు చేసి వెనుదిరిగిన ఆనంతరం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ముందుకు సాగించాడు. వీరిద్దరూ ఆసీస్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు సాధించారు. కొద్దిసేపటికి కోహ్లీ (34) కూడా వెనుదిరిగాడు. ఈ సమయంలో అజింక్యా రాహానేతో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని ఏర్పరిచాడు. పుజారా ఆసీస్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ అవకాశం దొరికినప్పడు బౌండరీలు కొడుతూ భారత స్కోరుబోర్డును 200 పరుగులకు దాటించాడు. ఈ క్రమంలోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న పుజారా చివరికి (71; 204 బంతుల్లో 9 ఫోర్లు) వెనుదిరిగాడు. పుజారా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం (194) పరుగులు చేశాడు. తర్వాత రహానే బాధ్యతాయుతంగా ఆడి భారత్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రహానే 147 బంతుల్లో 7 ఫోర్లతో 70 పరుగులు చేయడంతో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేయగలిగింది.
బౌలర్లు అదరగొట్టారు…
భారత జట్టు బ్యాటింగ్‌లో ఒకరిద్దరి తప్ప మిగత బ్యాట్స్‌మెన్స్‌ విఫలమైనా.. బౌలింగ్‌లో మాత్రం అందరు అదరగొట్టారు. ముగ్గురు పేసర్లకు తోడుగా స్పిన్నర్‌ రవిచంద్ర అశ్విన్‌ ఆసీస్‌ బ్యాట్స్‌మన్లు టాప్‌ లేపాడు. బ్యాటింగ్‌లో బలంగా ఉన్న ఆసీస్‌ను భారత బౌలర్లు ఆట ఆడించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 250 పరుగులకు ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్‌పై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. తొలి ఓవర్‌ మూడో బంతికి విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ అరోన్‌ ఫించ్‌ (0)ను ఖాతా తెరువకుండానే ఇషాంత్‌ శర్మ పెవిలియన్‌ పంపాడు. తర్వాత మార్కుస్‌ హారిస్‌, ఉస్మాన్‌ ఖవాజా భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు సాధించారు. అయితే ఈ సమయంలో రంగంలోకి దిగిన భారత స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్ర అశ్విన్‌ తన స్పిన్‌ మాయాజాలంతో ఆసీస్‌ పతనం మొదలుపెట్టాడు. ఇతని ధాటికి హారిస్‌ (26), ఖవాజా (28), షాన్‌ మార్ష్‌ (2) వెనువెంటనే వికెట్లు కోల్పోయారు. తర్వాత హాండ్స్‌కొంబ్‌, ట్రావిస్‌ హెడ్‌ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఆసీస్‌ను ముందుకు సాగించారు. వీరిద్దరూ డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇస్తూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. కానీ ఈ సమయంలో జస్ప్రీత్‌ బుమ్రా తెలివైన బంతితో హాండ్స్‌కొంబ్‌ను వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత మరింతగా పుంజుకున్న భారత బౌలర్లు వరుసక్రమాల్లో వికెట్లు తీస్తూ పోయారు. షమీ, ఇషాంత్‌, బుమ్రా తలో చేయ్యి వేయడంతో ఆసీస్‌ ధనాధన్‌ వికెట్లు కోల్పోయింది. వీరి ధాటికి ఆస్ట్రేలియా 235 పరుగులకే కుప్పకూలడంతో భారత్‌కు 15 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆసీస్‌లో ఒంటరి పోరాటం చేసిన ట్రావిస్‌ హెడ్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో (72) పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అశ్విన్‌, బుమ్రాలు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీలు రెండు రెండు వికెట్లు దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన స్వల్ప ఆధిక్యం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో అదే జోరుతో బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 307 పరుగులు చేసింది. తర్వాత 323 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాపై భారత బౌలర్లు మరోసారి తమ ఆధిపత్యం చెలాయిస్తూ వారిని కట్టడి చేశారు. అశ్విన్‌ తొలి వికెట్‌ పడగొట్టి బోణీ చేశాడు. తర్వాత మరో కీలక బ్యాట్స్‌మన్‌ ఉస్మాన్‌ ఖవాజా వికెట్‌ను కూడా అశ్విన్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు హారీస్‌, హాండ్స్‌కొంబ్‌లను మహ్మద్‌ షమీ వెనువెంటనే ఔట్‌చేసి ఆసీస్‌కు పెద్ద షాకిచ్చాడు. ఆ కొద్దిసేపటికే ట్రావిస్‌ హెడ్‌ను ఇషాంత్‌ శర్మ పెవిలియన్‌ పంపి భారత శిబిరంలో ఉత్సాహాన్ని నింపాడు. తర్వాత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ షాన్‌ మార్ష్‌ (166 బంతుల్లో 60), కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (41) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో భారత ఆశలపై నీరుగారింది. అయితే ఈ సమయంలో బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో ఆసీస్‌కు కోలుకోలేని దెబ్బతీశాడు. మార్ష్‌, పైన్‌, కమ్మీన్స్‌ల కీలకమైన వికెట్లు పడగొట్టి భారత్‌కు విజయానికి ఒక్క అడుగు దూరంలో చేర్చాడు. అయితే చివర్లో నాథన్‌ లియాన్‌ (38 నాటౌట్‌), హేజిల్‌వుడ్‌ (43 బంతుల్లో 13) భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ చివరివికెట్‌కు కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే చివర్లో అశ్విన్‌ తెలివైన బంతితో హేజిల్‌వుడ్‌ను పల్టీ కొట్టించడంతో టీమిండియా 31 పరుగులతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. ఆసీస్‌ లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ గొప్పగా పోరాడారు. రెండు ఇన్నింగ్స్‌లలో వారి పోరాటం అమోఘం. ఏదిఏమైన భారత బౌలర్లు కలిసికట్టుగా రాణించి గొప్ప విజయాన్ని అందుకున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments