జోగులాంబ జోన్లోకి నారాయణపేట జిల్లా
కాళేశ్వరం జోన్లోకి ములుగు జిల్లా
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణ జోనల్ వ్యవస్థలో కేంద్ర ప్రభు త్వం ఆమోదించిన మార్పులు, చేర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకా రం కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాను జోగులాంబ జోన్లో, ములుగు జిల్లాను కాళేశ్వరం జోన్లో చేర్చారు. అలాగే ప్రజల డిమాండ్ మేరకు వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్
నుంచి చార్మినార్ జోన్కు మార్చారు. దీంతో 33 జిల్లాల స్థానిక క్యాడర్ గుర్తింపు, ప్రత్యక్ష ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఆటంకాలు తొలగి, ఉద్యోగాల నియామకాలు, బదిలీలకు మార్గం సుగమం కానుంది. కొత్తగా రెండు జిల్లాలు నారాయణపేట, ములుగు ఏర్పడిన నేపథ్యంలో ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్, రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్)లో జోనల్ వ్యవస్థల్లో మార్పులు, చేర్పులతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిని కేంద్ర హోంశాఖ ఆమోదిస్తూ ఏప్రిల్ 19న గెజిట్లో ప్రచురించింది. దీంతోకేంద్ర ప్రభుత్వం గెజిట్కు అనుగుణంగా రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ బుధవారం నాడు జిఒ128ని జారీ చేసింది. తాజా మార్పులతో జోనల్ వ్యవస్థలో వచ్చే జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.
అన్ని విభాగాలు (పోలీస్ విభాగానికి మినహా) :
మల్టీ జోన్ – 1
జోన్ 1 (కాళేశ్వరం) – ఆసిఫాబాద్ కుమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు.
జోన్ 2 ( బాసర) – ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు.
జోన్ – 3 (రాజన్న) – కరీంనగర్, సిరిసిల్లా రాజన్న, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు.
జోన్ – 4 (భద్రాద్రి) – కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు.
మల్టీ జోన్ – 2
జోన్ – 5 (యాదాద్రి) – సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి యాదాద్రి, జనగామ జిల్లాలు.
జోన్ – 6 (చార్మినార్) – మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు.
జోన్ – 7 (జోగులాంబ) – మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు.
పోలీస్ విభాగం:
మల్టీ జోన్ – 1
జోన్ 1 (కాళేశ్వరం) – జయశంకర్ భూపాలపల్లి,ఆసిఫాబాద్ కుమ్రంభీమ్, రామగుండం పోలీస్ కమిషనరేట్, ములుగు.
జోన్ 2 ( బాసర) – ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, జగిత్యాల.
జోన్ – 3 (రాజన్న) – కరీంనగర్ పోలీస్ కమిషనరేట్, సిద్ధిపేట,పోలీస్ కమిషనరేట్, సిరిసిల్లా రాజన్న, కామారెడ్డి, మెదక్.
జోన్ – 4 (భద్రాద్రి) – కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం పోలీస్ కమిషనరేట్, మహబూబాబాద్, వరంగల్ పోలీస్ కమిషనరేట్.
మల్టీ జోన్ – 2
జోన్ – 5 (యాదాద్రి) – సూర్యాపేట, నల్లగొండ, రాచకొండ పోలీస్ కమిషనరేట్.
జోన్ – 6 (చార్మినార్) – హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ , రాచకొండ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సంగారెడ్డి, వికారాబాద్.
జోన్ – 7 (జోగులాంబ) – మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్.