HomeNewsAndhra pradeshజల సమాధి

జల సమాధి

ఎపిలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద జల్లేరు వాగులో పడిన బస్సు..
రూ. 5 లక్షల చొప్పున పరిహారం : సిఎం జగన్‌ ప్రకటన
క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం
ప్రజాపక్షం/ అశ్వారావుపేట ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సు వాగులో పడడంతో పది మంది మృతిచెంచారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరువాగు సమీపంలో బుధవారం డివైడర్‌ను ఢీకొన్న ఆర్‌టిసి బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడింది. ఆర్‌టిసి బస్సు బుధవారం అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెం వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జంగారెడ్డి గూడెం డిపోకు చెందిన తెలు గు వెలుగు బస్సు వేలేరుపాడు, కుక్కునూరుల మీదుగా 47 మంది ప్రయాణికులతో అశ్వారావుపేటకు చేరుకుంది. అక్కడి నుంచి జంగారెడ్డి గూడెంకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు జల్లేరు వాగులో పడడంతో డ్రైవర్‌ సహా పది మంది మృతిచెందారు. కొంగోరుగూడెం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ నిలిచి ఉండడంతో రెండు నుంచి మూడు మీటర్ల మేర లోతు ఉంది. బస్సు పల్టి కొట్టి నీళ్లలో పడిపోవడంతో ఊపిరి ఆడక పది మంది చనిపోయారు. చుట్టు పక్కల వ్యవసాయ పనులు చేసుకుంటున్న వారు ఆ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు క్షతగాత్రులను బయటకు తీశారు. మృతులంతా జంగారెడ్డి గూడెం ద్వారక తిరుమల మండలాలకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జంగారెడ్డి గూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి మృతుల బంధువులు చేరుకోవడంతో రోదనలు మిన్నంటాయి. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాలం తీరిన బస్సులు ఎటువంటి మరమ్మతులు చేపట్టకుండా ఆర్‌టిసి వినియోగిస్తుండడం వల్లే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు, ప్రయాణికులు ఆరోపణలు ఆరోపిస్తున్నారు.
సిఎం దిగ్భ్రాంతి :
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారికి సిఎం జగన్‌ సంతాపాన్ని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైత్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కాగా బస్సు ప్రమాదంపై మంత్రి పేర్ని నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. బస్సు ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక అందించాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు జారీచేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సకు అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని సిఎం స్పష్టం చేశారని మంత్రి తెలిపారు.
ఎపి గవర్నర్‌ విచారం
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ చిన్నారావుతో సహా తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటం బాధాకరమని గవర్నర్‌ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు గవర్నర్‌ హరిచందన్‌ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సహాయ చర్యలు వేగవంతం చేసి మృతుల సంఖ్య పెరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి
ఎపిలో బుధవారం జరిగిన బస్సు ప్రమాద ఘటనపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు కిషన్‌రెడ్డి సానుభూతి తెలిపారు. ఎపి సిఎస్‌కు ఫోన్‌ చేసి ప్రమాదం వివరాలను తెలుసుకోవడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పక్కల వ్యవసాయ పనులు చేసుకుంటున్న వారు ఆ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు క్షతగాత్రులను బయటకు తీశారు. మృతులంతా జంగారెడ్డి గూడెం ద్వారక తిరుమల మండలాలకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జంగారెడ్డి గూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి మృతుల బంధువులు చేరుకోవడంతో రోదనలు మిన్నంటాయి. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కాలం తీరిన బస్సులు ఎటువంటి మరమ్మతులు చేపట్టకుండా ఆర్‌టిసి వినియోగిస్తుండడం వల్లే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు, ప్రయాణికులు ఆరోపణలు ఆరోపిస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments