జయసారథి గెలుపు నాంది
కెసిఆర్ గొంతు పల్లాదైతే… ప్రశ్నించే గొంతు జయసారథిరెడ్డిది
వామపక్షాల అభ్యర్థులను శాసన మండలికి పంపడమే లక్ష్యం
బిజెపి, టిఆర్ఎస్కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
ప్రజాపక్షం / నల్లగొండ ప్రతినిధి మోస పూరిత పరిపాలన చేస్తున్న బిజెపి, టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయాలకు శాసనమండలి ఎన్నికల్లో జయసారథిరెడ్డి గెలుపు నాంది కావాలని, అందుకు ప్రతి పట్టభద్రుడు వామపక్షాలు బలపర్చిన అభ్యర్థి జయసారథిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పలువురు వామపక్ష నాయకులు కోరారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రు ల నియోజకవర్గ ఎంఎల్‌సి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వామపక్షా ల అభ్యర్థి జయసారథిరెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పట్టణంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డు నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లతో పాటు వేలాది మందితో భారీ ప్రదర్శన జరిగింది. సిపిఐ, సిపిఐ(ఎం), ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు వేలాది మంది తరలివచ్చి ప్రదర్శననలో పాల్గొన్నారు. మర్రిగూడ బైపాస్ నుండి ప్రారంభమైన ర్యాలీ హైదరాబాద్రోడ్, వీటి కాలనీ, ఎన్జీ కళాశాల గడియారం సెంటర్, ఆర్పిరోడ్, అంబేద్కర్ విగ్రహం, మిర్యాలగూడ రోడ్ మీదుగా ర్యాలీ సాగింది. ర్యాలీలో ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన వాహనంలో అభ్యర్థి జయసారథితోపాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎంఎల్‌సి అలుగుబెల్లి నర్సిరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు ప్రసంగించారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఏటా రూ.2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని, విదేశీ స్విస్ బ్యాంకుల్లో ఉన్న రూ.72లక్షల కోట్ల నల్లధనాన్ని దేశానికి తెప్పించి ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు ఇస్తానన్నా మాటను ప్రధాని మోడీ మరిచిపోయారన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆయన విమర్శించారు. విపరీతంగా పెట్రోల్, డిజీల్, వంట గ్యాస్ ధరలు పెంచుతూ పన్నుల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవంతో తెచ్చుకున్న తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలనే భర్తీ చేయలేని అసమర్థత పాలకులు సిఎం కెసిఆర్ అని వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం అన్నారు. పైగా గ్రామీణ ఉపాధి హామీలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్, మిషన్ భగీరథలో పని చేస్తున్న వారిని తొలగించడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కెసిఆర్‌ను ఎదురించేందుకు వామపక్షాలు ఐక్య కూటమిగా పని చేస్తున్నాయన్నారు. సిఎం కెసిఆర్ గొంతుకగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి పని చేస్తున్నారని, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా వామపక్షాల అభ్యర్థి జయసారథిరెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. రాష్ట్రంలో నూతన వ్యవసాయ చట్టాలను అమలు చేయడం ద్వారా కొనుగోలు కేంద్రాలు లేకుండా చేస్తున్న సిఎం కెసిఆర్ ప్రభుత్వాన్ని గంగలో పడేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. త్యాగాలకు నిలయం, సాయుధ పోరాటాలు నడిపిన నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో జయసారథిరెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగేశ్వర్‌ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి శాసన మండలికి పంపాలని పిలుపునిచ్చారు.
ఐక్యత ఫలితమే జయసారథి ఘన విజయానికి కృషి: తమ్మినేని…
వామపక్షాల ఐక్యత ఫలితమే శాసనమండలి ఎన్నికల్లో జయసారథిరెడ్డి గెలుపుకు కృషి అని తమ్మినేని వీరభద్రం అన్నారు. బిజెపి, టిఆర్ఎస్లు గెలిస్తే అహంకారం, ఆధిపత్యం పెరుగుతుందని, వాటిని నిరోధించేందుకు దేశంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్‌లను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా చమురు పన్నులు భారతదేశంలోనే పెంచుతున్నారని అందుకు మోడీ ప్రభుత్వం సిగ్గు పడాలని విమర్శించారు. మతం, కులం, ప్రాంతాల మనోభావాలతో ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు బిజెపి, టిఆర్ఎస్ నాయకులు ముందుకొస్తున్నారని, వారికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలన్నారు.
అవకాశం ఇవ్వండి… నిద్రపోయిన ప్రభుత్వాన్ని మేల్కోలుపుతా
ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్ధమేనా: ఎంఎల్‌సి అభ్యర్థి జయసారథిరెడ్డి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.31లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రకటించుకుంటున్న టిఆర్ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎక్కడ ఉద్యోగాలు భర్తీ చేశారో చర్చించేందుకు చర్చకు సిద్దమేనా అని వామపక్షాల ఎంఎల్‌సి అభ్యర్థి జయసారథిరెడ్డి సవాల్ చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన ప్రజా గొంతుకకై ప్రశ్నించేందుకు తనకు ఒక అవకాశం ఇచ్చి శాసనమండలికి పంపిస్తే నిద్రపోయిన మొద్దు ప్రభుత్వాన్ని మేల్కోలుపుతానని అన్నారు. కమ్యూనిస్టులకు ఎంఎల్ఎలు, ఎంఎల్‌సిలు, ఎంపిలు లేరని, ప్రజాబలం లేదని ఎగతాలి చేస్తున్న పార్టీలకు నేడు జరిగిన పట్టభద్రుల భారీ ప్రదర్శనే తగిన సమాధానమన్నారు.
తోడుగా ప్రశ్నించే గొంతుక కావాలి: ఎంఎల్‌సి నర్సిరెడ్డి
ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా తనతో పాటు మరో గొంతుక అయిన జయసారథిరెడ్డిని గెలిపించుకోవాలని, అందుకు ప్రతి ఒక్క పట్టభద్రుడు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎంఎల్‌సి అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎంఎల్‌సిగా గెలిచి ఆరేళ్లు అవుతున్నదని, ఎవరి కోసం పని చేశారో ఎన్నికలకు ఓట్లు అడిగేందుకు వస్తున్నారో పట్టభద్రులు, నిరుద్యోగులకు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో 11 యూనివర్సిటీలలో సహచార్యులు, ఆచార్యుల పోస్టులు భర్తీ చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం టిఆర్ఎస్ది కాదా అని ప్రశ్నించారు. యూనివర్సిటీలను నెలకొల్పుకునేందుకే ఎంఎల్‌సి పదవీని వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాస్, సిపిఐ(ఎం) రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ అధ్యక్షత వహించగా , సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హనుమంతరావు, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు భుజంగరావు (ఎస్టియుసి), చావా రవి (యూటిఎఫ్), ఉస్తేల సృజన (మహిళా సమాఖ్య), మల్లు లక్ష్మీ(ఐద్వా), సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సిపిఐ రా్రష్ట్ర నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు, గోదా శ్రీరాములు, మల్లు నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.
ర్యాలీని అడ్డుకున్న అధికార పార్టీ
వామపక్ష ఎంఎల్‌సి అభ్యర్థి జయసారథిరెడ్డి తన నామినేషన్ దాఖలు చేయడానికి నల్లగొండ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మర్రిగూడ బైపాస్ నుంచి కలెక్టరేట్‌కు చేరుకునే సమయంలో కలెక్టరేట్ వద్ద అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా కలెక్టరేట్ వద్ద సభలు నిర్వహించారు. జయసారథిరెడ్డి ర్యాలీకి దారీవ్వకుండా అడ్డుకుని రోడ్డుమీదనే సభ నిర్వహించారు. ర్యాలీ కలెక్టరేట్ వరకు చేరుకలేకపోయింది. తాము పోలీసుల నుండి అనుమతి తీసుకున్నప్పటికీ ర్యాలీ జరగనివ్వకుండా రోడ్డుపై సభ నిర్వహించడం ఏమిటని అక్కడున్న పోలీసులను వామపక్ష పార్టీల నాయకులు నిలదీశారు. దీంతో వామపక్ష పార్టీల నాయకులకు, అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులకు వాగ్వాదం జరిగింది.
చాడ వెంకట్‌రెడ్డి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎంఎల్‌సి అలుగుబెల్లి నర్సిరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు ప్రసంగించారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఏటా రూ.2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని, విదేశీ స్విస్ బ్యాంకుల్లో ఉన్న రూ.72లక్షల కోట్ల నల్లధనాన్ని దేశానికి తెప్పించి ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు ఇస్తానన్నా మాటను ప్రధాని మోడీ మరిచిపోయారన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆయన విమర్శించారు. విపరీతంగా పెట్రోల్, డిజీల్, వంట గ్యాస్ ధరలు పెంచుతూ పన్నుల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవంతో తెచ్చుకున్న తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలనే భర్తీ చేయలేని అసమర్థత పాలకులు సిఎం కెసిఆర్ అని వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం అన్నారు. పైగా గ్రామీణ ఉపాధి హామీలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్, మిషన్ భగీరథలో పని చేస్తున్న వారిని తొలగించడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కెసిఆర్‌ను ఎదురించేందుకు వామపక్షాలు ఐక్య కూటమిగా పని చేస్తున్నాయన్నారు. సిఎం కెసిఆర్ గొంతుకగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి పని చేస్తున్నారని, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా వామపక్షాల అభ్యర్థి జయసారథిరెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. రాష్ట్రంలో నూతన వ్యవసాయ చట్టాలను అమలు చేయడం ద్వారా కొనుగోలు కేంద్రాలు లేకుండా చేస్తున్న సిఎం కెసిఆర్ ప్రభుత్వాన్ని గంగలో పడేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. త్యాగాలకు నిలయం, సాయుధ పోరాటాలు నడిపిన నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో జయసారథిరెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగేశ్వర్‌ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి శాసన మండలికి పంపాలని పిలుపునిచ్చారు.