25 మంది ప్రమాణస్వీకారం
ఐదుగురు డిప్యూటీ సిఎంలు
సరికొత్త సామాజిక మార్పు
హోంమంత్రిగా సుచరిత, ఆర్థిక మంత్రిగా బుగ్గన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం కొలువుదీరిం ది. మొత్తం 25 మంది మంత్రులతో తెలుగు రా ష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. వెలగపూడిలోని సచివాలయ ప్రాం గణంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ము ఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రులుగా వరుస క్రమంలో మొదట శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎంఎల్‌ఎ ధర్మాన కృష్ణదాస్ ప్రమాణం చేశారు. తరువాత విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు బిసి), అదే జిల్లాకు చెందిన పా ముల పుష్పశ్రీవాణి (ఎస్‌టి), విశాఖపట్నం జిల్లా కు చెందిన ముత్యంశెట్టి శ్రీనివాసరావు (కాపు), తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కురసాల కన్నబాబు (కాపు), అదే జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ (శెట్టిబలిజ పినిపె విశ్వరూప్ (ఎస్‌సి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (కాపు), చెరుకువాడ శ్రీరంగనాథరాజు (క్షత్రియ), తానేటి వనిత (ఎస్‌సి మాదిగ), కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి శ్రీ వెంకటేశ్వర్‌రావు (కమ్మ), అదే జిల్లా కు చెందిన పేర్ని నాని (కాపు), వెలంపల్లి శ్రీనివా స్ (వైశ్య), గుంటూరు జిల్లాకు చెందిన మేకతోటి సుచరిత (ఎస్‌సి మాల), మోపిదేవి వెంకటరమణారావు (మత్స్యకారుడు- ప్రకాశం జిల్లా కు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి (రెడ్డి), ఆదిమూలపు సురేష్ (ఎస్‌సి మాదిగ), పిఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాకు చెందిన పాలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ (యాదవ- మేకపాటి గౌతమ్‌రెడ్డి (రెడ్డి), చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (రెడ్డి), కళత్తూరు నారాయణస్వామి (ఎస్‌సి మాల), కర్నూలు జిల్లాకు చెం దిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (రెడ్డి), గుమ్మనూరు జయరామ్ (బోయ- బిసి), వైఎస్సార్ జిల్లాకు చెందిన షేక్ బేపారి అంజాద్ బాషా (ముస్లిం- అనంతపురం జిల్లాకు చెందిన మాలగుండ్ల శంకరనారాయణ (కురుబ- మంత్రులు గా ప్రమాణం చేశారు. ఆతర్వాత సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి, గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్, నెల్లూరు జిల్లాకు చెందిన గౌతంరెడ్డి ఆంగ్లంలో ప్రమాణం చేశారు. మంత్రుల పదవీ స్వీకార ప్ర మాణ కార్యక్రమం జాతీయగీతాలాపనతో ముగిసింది.
జగన్ మంత్రివర్గం హౌస్‌ఫుల్
RELATED ARTICLES