గూగుల్ తో కలిసి జియో నెక్స్
ముంబయి : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)కు చెందిన జియో నుంచి ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఫోన్ అందుబాటులోకి రానుం ది. గూగుల్ సహకారంతో ‘జియో నెక్స్’ పేరు తో చౌకైన ఫోన్‌ను గణేశ్ చతుర్ధిని పురస్కరించుకొని ఈ ఏడాది సెప్టెంబర్ 10న మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. చైర్మన్ ముఖేష్ అంబానీ అధ్యక్షతన జరిగిన ఆర్‌ఐఎల్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే కొత్త స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ ఫీచర్స్‌తోపాటు వివిధ యాప్స్ కూడా ఉంటాయ ని ముఖేష్ అంబానీ ప్రకటించారు. సామాన్యుల కోసమే ఈ కొత్తస్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తెస్తున్నట్టు ప్రకటించారు.ఇది ప్రపంచంలోనే చౌకైనదని పేర్కొన్న ఆయన ఖరీదు మాత్రం స్పష్టం చేయలేదు. దేశాన్ని 2 జి రహిత, 5 జి వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని అన్నారు. కాగా, కొత్త స్మార్ట్‌ఫోన్ అనేది ఆర్‌ఐఎల్, గూగుల్ మధ్య రెండు భాగాల ఒప్పందంలో భాగం. మొదటి భాగంలో గూగుల్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ .33,737 కోట్ల విలువైన 7.73% వాటానుకు తీసుకుంది. రెండో ఒప్పందంలో భాగంగా ఎంట్రీ లెవల్ సరసమైన సార్ట్‌ఫోన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేస్తుంది. గూగుల్‌తో జియో భాగస్వామ్యాన్ని ఆర్‌ఐఎల్ గత ఏడాదే ప్రకటించింది. అందులో భాగంగానే గూగుల్, జియో సహకారంతో కొత్త ఫోన్ మార్కెట్‌లోకి వస్తుంది. కాగా, గూగుల్ క్లౌడ్, జియోల మధ్య కొత్త 5 జి భాగస్వామ్యం సుమారు వంద కోట్ల మంది భారతీయులకు వేగవంతమైన ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవ్వడానికి వీలుకల్పిస్తుంది.
భారీగా పెట్టుబడులు
ఇలావుంటే, ఆర్‌ఐఎల్ బోర్డులో కొత్త సభ్యులు చేరారు. చమురు విభాగంలో ఈ సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టిన సౌదీ అరేబియా సంస్థ సౌదీ ఆరామ్కో ఛైర్మన్ యాసిర్ అల్ రుమయాన్ రిలయన్స్ బోర్డులోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ ఫైనాన్స్, టెక్నాలజీలో యాసిర్ అల్ రుమయాన్ ప్రముఖ వ్యక్తి. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన సౌదీ ఆరామ్కో ఛైర్మన్‌గా ఆయన అనుభవం నుంచి ప్రయోజనం పొందుతామనే విశ్వాసం తమకు ఉందని ఆర్‌ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. దీనిని రిలయన్స్ ప్రపంచీకరణలో మొదటి అడుగుగా ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రిలయన్స్ ఎదుగుదలకు ఇది ప్రారంభం మాత్రమేనని భవిష్యత్తులో మరిన్ని ప్రణాళికలు రానున్నాయని అన్నారు.రిలయన్స్ గత ఏడాది సమీకృత ఆదాయం రూ.54,000 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఇబిఐటిడిఎ రూ.98,000 కోట్లుగా నిలిచింది. వీటిల్లో 50శాతం వినియోగ వస్తువుల వ్యాపారం నుంచే లభించింది. భారత ఆర్థిక వ్యవస్థ ఎగుమతుల్లో 6 .8శాతం వాటాను ఆర్‌ఐఎల్ అందించడం విశేషం. కంపెనీలో కొత్తగా 75,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చారు. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకం కింద రూ. 21,044 కోట్లు, జిఎస్‌టి కింద రూ. 85,306 కోట్లు, వ్యాట్ రూపంలో రూ.3,213 కోట్లు ఆదాయపు పన్ను చెల్లించింది. రూ.3,24,432 కోట్ల మూలధనాన్ని సమకూర్చుకోగలిగింది. ఇది ప్రపంచం వ్యాపార రంగంలో రెండో అతి పెద్ద పెట్టుబడి. మొత్తం 425 మిలియన్ల మందికి రిలయన్స్ సేవలు అందిస్తోంది.
చౌకైన ఫోన్
RELATED ARTICLES