చైనా పురోగమనాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు

తియాన్మిన్‌ స్కేర్‌ పరేడ్‌లో జీ జిన్‌పింగ్‌ వ్యాఖ్య

బీజింగ్‌: చైనా పురోగమనాన్ని ఏ శక్తి అడ్డుకోలేదని ఆ దేశ అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ మంగళవారం అన్నారు. చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి 70ఏళ్లయిన సందర్భంగా బీజింగ్‌లోని తియాన్మిన్‌ స్వ్కేర్‌లో అతి పెద్ద పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చైనా స్థాయిని, పురోగమిస్తున్న చైనీయులను ఏ శక్తి అడ్డుకోలేదు’ అని ఆయన అన్నారు. చైనా ప్రజలను ఎవరూ ఎదుర్కోలేరు. ఏ శక్తీ మనల్ని ఏమీ చేయలేదు. మనదేశ పునాదులను కదిలించే సత్తా ఎవరికీలేదు. ఈ దేశం అన్ని విధాలా దూసుకుపోతుంది. పేదరికం నుంచి ప్రపంచంలో రెండో ఆర్థిక శక్తిగా ఎదిగాం. ఇంకా అభివృద్ధి సాధించగల సత్తా మనకుంది అంటూ పరోక్షంగా అమెరికానుద్దేశించి జిన్‌పింగ్‌ చెప్పారు. పరేడ్‌కు ముందు ఆయన ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. ప్రపంచంలో 20 లక్షల సైనిక బలగం కలిగిన చైనా తన శక్తి పాటవాన్ని ఈ పరేడ్‌లో ప్రదర్శిచింది. దీర్ఘ శ్రేణి ఖండాంతర క్షిపణులు సహా వివి ధ ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. చైనాలో మావో తర్వాత అంత శక్తిమంత నాయకుడిగా జి జిన్‌పింగ్‌ ఎదిగారు. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా(సిపిసి) నాయకత్వంలో చైనా తలరాతే మారిపోయిందని, పేద, బలహీన దేశంగా 100 ఏళ్లకు పైగా అవస్థలు పడ్డ చైనా నేడు ఆధునిక యుగంలో చాలా మారిపోయిందని జిన్‌పింగ్‌ తెలిపారు. జిన్‌పింగ్‌కు పూర్వపు సిపిసి నాయకులు జియాంగ్‌ జెమిన్‌(93), హూ జింటావో(76) లు ఆయన పక్కన ఉండి సిపిసి నాయకత్వానికి ఐక్యత ను, సంఘీభావా న్ని చాటారు. వ్యూహాత్మక పోటీ అమెరికా నుంచి ఎదురవుతున్న తరుణం లో సిపిసి నాయకత్వాన్ని చైనా ప్ర జలు కాపాడాలన్నా రు. పరేడ్‌లో మావో ఫోటోలు, ఆయన వారసుల ఫోటోలను కూడా ప్ర దర్శించారు. సరిగా 70 ఏళ్ల క్రి తం కామ్రేడ్‌ మావో జెడాంగ్‌ పీపు ల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా(పిఆర్‌సి)ని స్థాపించారు. చైనా పురోగతి, ఎదుగుదలను చూసి ప్రపంచ దేశాలు కలవరం చెందుతున్నప్పటికీ చైనా శాంతియుత మార్గంలో అభివృద్ధి పథాన నిలుస్తుందని జిన్‌పింగ్‌ ఈ సందర్భంగా చెప్పారు. ‘అన్ని దేశాల ప్రజలతో కలిసి మే ము పనిచేస్తాం. మానవాళి భవిష్యత్తు కోసం కలిసి విశా ల సముదాయాన్ని నిర్మిస్తాం. అమెరికాతో చైనాకు వాణి జ్య యుద్ధం ఉన్నప్పటికీ తన ప్రపంచ ప్రాబల్యాన్ని విస్తరించేందుకు చైనా అనేక మిలియన్‌ డాలర్ల బెల్ట్‌ రోడ్‌ ఇ న్షియేటివ్‌(బిఆర్‌ఐ)ని చేపట్టింది. చైనా పీపుల్స్‌ లిబరేష న్‌ ఆర్మీ(పిఎల్‌ఎ) తన స్వతః గుణాన్ని, ఉద్దేశాన్ని కాపాడుకుంటూ చైనా ప్రజలకు అండగా ఉండాలని జిన్‌పింగ్‌ కోరారు. చైనా సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను కాపాడాలన్నారు. అంతేకాక ప్రపంచ శాంతిని కూడా గట్టిగా పరిరక్షించాలన్నారు. రానున్న ఐదేళ్ల ద్వైపాక్షిక సంబంధాలపై కార్యక్రమాన్ని రూపొందించేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఈ నెల రెండో వారంలో చెన్నై సమీపంలోని మామల్లాపురంను సందర్శించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో అనధికార రెండో సమావేశాన్ని కూడా చేపట్టనున్నారు. హాంకాంగ్‌ గురించి మాట్లాడుతూ ‘మన పయనం ముందుకు కొనసాగాలి. ‘శాంతియుత పునరైక్యత’, ‘ఒకే దేశం, రెండు విధానాలు’ సిద్ధాంతాలను నిలబెడదాం. హాంకాంగ్‌, మ కావోలో శాశ్వత సౌభాగ్యం, సుస్థిరత నిలుపుదాం’ అ న్నారు. పరేడ్‌లో ఆయన అనేక ఆయుధాల ప్రదర్శన తి లకించారు. యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, హైటెక్‌ డ్రో నులతో సుమారు 15వేల బృందాలు ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి. చైనా స్వయంగా తయారుచేసిన ఐదు జె జెట్‌ యుద్ధ విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేశా యి. చైనా హెచ్‌ వ్యూహాత్మక బాంబర్‌ విమానం కూడా విన్యాసాలు చేసింది. హెచ్‌ అనే మీడియం, దీర్ఘ శ్రేణి బాంబర్‌ కూడా తొలిసారి ప్రదర్శనలో పాల్గొం ది. సూపర్‌సోనికి సిజె క్రూయిజ్‌ క్షిపణిని ,అత్యధిక ఎత్తులో దూసుకెళ్లగల హైస్పీడ్‌ రికనైజెన్స్‌ డ్రోన్లను కూడా ప్రదర్శించారు. కొత్త తరం యుద్ధరంగం 99ఎ ట్యాంకులను కూడా పిఎల్‌ఎ ప్రదర్శించింది. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద పరేడ్‌గా ఆ దేశ మీడియా వర్ణించింది.

DO YOU LIKE THIS ARTICLE?